అభిప్రాయము
నన్ను గతములో , వర్తమానములో నడిపించిన
మరియు భవిష్యత్తులో నడిపించే మహాత్ములకు
పెక్కునమస్కారములు.
పల్లెటూరిలో పుట్టి రాకృతి రసాస్వాదన
చేస్తూ అనుక్షణము కొత్త కొత్త మార్పులను ఎదుర్కొంటూ 13 జూన్ నెల
శ్రీముఖ జ్యేష్ట శుద్ద నవమి నాడు
ఇది వ్రాయుటను మొదలు పెట్టాను. దీని తరువాత చాలా వ్యాసాలు వ్రాసాను. వాటిని నా బ్లాగ్ లోని వ్యాసాల సంపుటి లో పెట్టడము కూడా
జరిగినది. కానీ దీనిని పట్టించు కొ లేదు. ఇటీవలే దీనిని తయారు చేయడము మొదలు పెట్టినాను.
ఈ నాడు రతి యొక్కరూ
అంటే నేను, నీవు మరి ఎందరో అందరికీ ఒక అలవాటు అయింది. అలా
చెప్పుకుంటున్నారు, ఈ లోకము పాడయి
పోయిందనీ, ప్రతి యొక్కరిలో స్వార్థము
పెరిగిపోయిందని, అలా చెప్పడము తో
తమ భాధ్యత తీరిపోయిందనీ అనుకుంటున్నారు,
లేదా భాధ్యత నుండి తప్పుకుంటున్నారు.
గౌతమ బుద్ధుడిని, కొంత మంది
ప్రశ్నించి నారుట, “మరణానంతరము
జీవితమునడా?” అని. “ముందు ఈ జీవితమును పట్టించుకొనన్ది.’ అని చెప్పినారుట.
మిగిలిన లేదా అనవసర ఆలోచనలు ఇప్పుడు అనవసరమన్నట్లు. వచ్చిన వారు వెంటనే తమ చిట్టా లో వ్రాసుకున్నారుట,” మరణానంతర జీవితము
లేదని బుద్ధుడు చెప్పినాదని.” ఇక బుద్ధుడి పేరు మీద ఉన్న జాతక కథలు
మరణానంతర/పునర్జన్మను సూచిస్తున్నాయన్న విషయాన్ని వారు మరిచి పోయినారు. లలిత
విస్తారమనే బౌద్ధ గ్రంథములో తన గత జన్మ గురించి బుద్ధుడు ప్రస్తావించినట్లు
ఉన్నది. బౌద్ధ గరువులు(టిబెటన్ లామాలు) తరచుగా పునర్జన్మ గురించి ప్రస్తావిస్తారు.
కానీ బుద్ధుడి ఆలోచన ప్రకారము, మరణమూకంటే
ముందు తరువాత ఏమీ ఉండదని హడావుడి చేసి చెప్పేస్తారు మన దార్శనీకులు మరియు
చరిత్ర కారులు.
పూర్వ కాలములో గురువులు శిష్యులకు
ఎంత అవసరమో అంతా వరకే బోధించే వారు. కానీ,
ఈ నాటి శిష్యులు “గురువు గారు! మీరు చెప్పగలిగినంత వరకూ చెప్పండి, ఎరుకొన
గల్గినన్న విషయాలను మేమే వేరుకుంటామని అంటున్నారు. వీరే అసలాయిన గురువును మించిన
శిష్యులు. శిష్యులకు ఏమి ఇవ్వాలో తెలియని
గురువులు, గురువుకే పాఠాలను చెప్పాలనుకొనే శిష్యులు , ఇదీ మన నూతన విద్యా
విధానములో మార్పు, ఇలాగే నడుస్తూ ఉంది.
నా చిన్నప్పుడు గోడల మీద విద్యార్థి
సంఘాలు కొన్ని నినాదాలు వ్రాసినాయి. అవి ఏమిటంటే,
1.
మాకు శాస్త్రీయ విద్యా విధానము కావాల.
2.
విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి 1:20 ఉండాలి.
మొదట ఇదేనా శాస్త్రీయ విద్యా
విధానము అని అనిపించినది. తరువాత అర్థమయింది, ఇది గాని వస్తే నేర్చుకొనే విషయాలు
ఏమయినా నిరుద్యోగ సమస్య మాత్రము తీరిపోతుంది అని.
ఈ వ్యాసము కొంచెము అసంపూర్తిగా
ఉంది.
No comments:
Post a Comment