చాలా మందికి ఒక
దురభిప్రాయముంది. మయ సభలో నీళ్ళలో పడిన దుర్యోధనుడిని
చూచి ద్రౌపది నవ్వడము వలననే మహా భారత
యుద్ధము లాంటి ప్రపంచ యుద్ధమునకు మొదటి మెట్టు పడింది అని. మహా భారత కర్త మహర్షి
వేదవ్యాసుది మాటలలోనే నిజాన్ని తెలుసుకుందాము.
మహా భారతాన్ని రచించిన
మహర్షి కి తెలియని విషయము లేదు. అందుకే “వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం” అని అంటారు. ఈ విశ్వమంతా వ్యాసుడి
ఎంగిలే అనే ఒకమాట. అంటే ప్రతి విషయమూ ఆయన నోటినుండే వచ్చింది అని మనము అర్థము
చేసుకోవాలి.
ఇంకా ద్రౌపది అగ్ని నుండి
పుట్టింది. అగ్ని పవిత్రతకు చిహ్నము. అంటే ఆమె ఎంత పవిత్రురాలో చెప్పనవసరము లేదు.
అటువంటి ఆమె ఒక సభలో ఒకరు పడి పోవుట చూచి నవ్వుతుందా?
ఇంకా వ్యాస మహర్షి ఏమని
వ్రాసినారో చూద్దాము. సభా పర్వము లోని డ్యూట పర్వములో
స కదాచిత్ సభా మధ్యే ధార్త రాష్ట్రో మహేపతిః |
స్ఫాటికం స్థల
మాసాద్య జలమిత్యభి శంకయా||
స్వ వస్త్రోత్కర్షణం రాజా కృతవాన్
బుద్ధి మోహితః |
దుర్మనా విముఖశ్చైవా
పరి చక్రామ తాం సభాం ||
తతః స్థలే నిపతితః దుర్మనా
వ్రీడితో నృపః |
నిః శ్వసన్ విముఖ శ్చాపి పరి చక్రామ తాం సభాన్ ||
తతః స్ఫాటిక తోయాం
వై స్ఫాటికాంబుజ శోభి తాన్ |
వాపీం మత్వా స్థల మివ స వాసాః ప్రా పతజ్జలె ||
{సంక్షిప్తముగా}మయ సభలో
స్ఫటిక మణులు పొదిగిన స్థలములో నీరున్నాదని భ్రమ పడి వస్త్రాన్ని ఎత్తి
పట్టుకున్నాడు. తరువాత స్ఫటిక మణుల వలే స్వచ్చమయిన నీటి కొలనును స్థలమను కొని
కట్టు బట్టలతో అందులో పడ్డాడు.
జలే నిపతితం దృష్ట్వా భీమ సేనా మహా బలః|
జహాస జహసు శ్చైవ
కింకరాశ్చ సుయోధనం||
వాసాంసిచ శుభాన్యస్మై
ప్రదదూ రాజ శాసనాత్ |
తతాగతం తం దృష్ట్వా భీమ సేనో
మహా బలః ||
అర్జునశ్వయనోచోభౌ సర్వే తే ప్రాహ సంస్తదా|
నామర్షయాత్ తతస్తేషాం
అపహాస మమర్షణః||౩-౯ శ్లోకాలు సభా పర్వములో
ద్యూత పర్వము)
నీళ్ళలో పడిన
దుర్యోధనుడిని చూచి, భీముడు, అతడి సేవకులు నవ్వినారు. రాజాజ్ఞను అనుసరించి వేరే
వస్త్రములు ఈయ బడినవి. అతడి స్థితిని చూచి భీమార్జున నకుల సహా దేవులు నవ్వినారు.
సహనము తక్కువయిన దుర్యోధనుడు ఈ
పరిహాసాన్ని సహించ లేక పోయినాడు. తరువాత తండ్రితో ఇలా చెబుతాడు.
పునశ్చ తాదృసీమైవ
వాపీం జలజ శాలినీం|
మత్వా శిలా సమం తోయే
పతిsతోస్మి నరాధిప||
తత్ర మాం ప్రాహసత్ కృష్ణః
పార్థేన సహ సుస్వరం|
ద్రౌపదీ చ సహా స్త్రీ భిః
వ్యథయంతి మనో మమ||{ద్యూ త పర్వము సర్గ ౫౦ శ్లోకాలు ౨౯-౩౦)
ఒక చోట కొలను చదును
చేయబడిన స్థలముగా భావించి అందులో పడినపుడు తనను చూచి కృష్ణార్జునులు, ఇతర త్రీ
పరివారముతో నున్నద్రౌపడి నవ్వారని చెబుతాడు.
అంతకు ముందు తను నీళ్ళలో
పడుట చూచి భీముడు నవ్వినాడని, అప్పుడే తను
భీముడిని చంపి వేసే వాడినని, శిశుపాలుడికి
పట్టిని గతి గుర్త్కు వచ్చి భయ పడినానని చెబుతాడు.
దుర్యోధనుడు సహజముగా
అసూయాపరుడు. రాజ సూయ యాగములో వచ్చిన కానుకలను స్వీకరించే భాద్యత అతడికి ఈయ బడినది.
ఆ సంపదను గురించి తన తండ్రికి చెప్పిన విధానమే అతడు ఎంతగా అసూయా గ్రస్తు డయినాడో చెబుతుంది.
అటువంటి మానసిక స్థితిలో అతడు మయ సభకు మరొక వ్యక్తీ కూడా తోడు లేకుండా వెళ్ళినాడు.
వివేకమును కోల్పోయి తను నీళ్ళలో పడడమే కాక
గోడ లేదనుకొని గోడను కూడా కొట్టుకున్నాడు.
తనకు సహజంగా ఉన్న అసూయను
ప్రస్ఫుటము చేయడానికి తనను చూచి కృష్ణుడు మాత్రమే కాక ద్రౌపది కూడా నవ్విందని
చెప్పాడు. ఆ మాట వ్యాస మహర్షి చెప్ప లేదు.ద్రౌపది సంస్కారము కూడా అటువంటిది కాదు.
నన్నయ భట్టారకుడు ఆ
విధముగా వ్రాయడములో ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది.
మూల రచనలకు అనువాదాలకు
తేడా ఉండటము మన భాషలో చాలా సార్లు జరిగింది. అటువంటి అపప్రథ ద్రౌపదికి రావడము మన దురదృష్టము.
ఓం శాంతి శాంతి
శాంతిః.
No comments:
Post a Comment