Friday, August 17, 2018

కాలోSహి దురతిక్రమః








               మహా భారతములో  ద్రుతరాష్ట్రుడు  తనకు జరిగిన విషాద సంఘటనలను సంజయుడికి  వెల్లడిస్తే  సంజయుడు ఇచ్చిన సమాధానమిది.

విదాతృ విహితం మార్గే                      న కశ్చిదతి వర్తతే
కాల  మూల మిదం  సర్వే                    భావా  భావౌ Sశుభా శుభౌ||

            అంటే బ్రహ్మ దేవుడి  విహిత  మార్గమునకు ఏదీ  వ్యతిరేకము కాదు. భావములో లేదా అభావములో (అంటే     లేమిలో ) సుఖములో  లేదా  కష్టములో  అంతా కాలమును అనుసరించి జరుగుతుంది.

కాలః  సృజతి భూతాని                        కాలం  సంహరతే  ప్రజాః
సంహరంతి ప్రజాః  కాలం                      కాలః  శమయతే  పునః||

          భూత  జాలాన్ని  కాలమే  సృష్టిస్తున్నది. జనాన్ని  కాలమే  హరిస్తున్నది. ప్రజలు  కాలాన్ని హరిస్తారు. తిరిగి కాలమే అన్నిటినీ  శాంత పరుస్తుంది.

అతీతా  నాగతా భావా                         ఏచ  వర్తంతి  సామ్ప్రతం
తాన్  కాల  నిర్మితాన్ భావాన్                  సంజ్ఞాం కర్తు మర్హసి||

       ఇప్పుడు  వర్తించే/వచ్చే  భావాలు ఊహించ లేనివి. అవి కాల నిర్మిత మయినవి. వాటిని సూచించుట వీలు  కాని  పని.

ఇవి కాలమును గూర్చి  మహా భారతములో ఉన్న మాటలు.ఇదే  భావమును Archibald Wheeler  తన  Gravitation పుస్తకములో  ఈ విధముగా వెల్లడించినాడు.
Time is awake when all things sleep
Time stands straight when all things fall.
Time shuts  in all and will not be shut.
Is, was and shall be are time’s children.
O  Reasoning, be witness, be stable.
·         Vyasa,  Maha Bharata

Monday, August 6, 2018

నిశ్చితార్థము




కొన్ని సంవత్సరాలు గడిస్తే  ఈ పదము ఎక్కడో విన్నట్లున్నదని జనము అనుకోవచ్చును. ఈ పెను మార్పులు జరిగితే  మన  సాంప్రదాయములో  కొన్ని విశేషాలు  కను మరుగు  అయ్యే పరిస్థితులు  ఏర్పడినాయి.


వివాహ క్రతువులో నిశ్చితార్థము ఒక భాగము.  ఈనాడు  పెళ్లి/వివాహము  చాలా మందికి ఒక వినోదము గా మాత్రమే మిగిలినది. అందులో  పురోహితుడి కంటే  ఫోటోగ్రాఫర్ ది పెద్ద పాత్ర. ఇంక పెద్దలు కాబోయే  వధూ వరుల  అంగీకారము తో  ఈ వివాహము జరుపుటకు  నిశ్చయించ  బడినదన్న సంకేతముగా మంగళ  సామగ్రిని  రెండు భాగస్వామ్య  కుటుంబాలు ఇచ్చి పుచ్చుకోవడాన్ని నిశ్చితార్థము అని  అంటారు. ఆర్ధిక పరపతి ఉన్న వారు దీనిని కూడా పెళ్ళి అన్నంత వేడుకగా  జరపడము కద్దు. దురదృష్ట మేమిటంటే ఇందులో  ఆడంబరాలకే ప్రాధాన్యతను స్తున్నారు.

రెండు కుటుంబాల మధ్య సంబంధాలను ఏర్పరచేది పెళ్లి. వధూ వరులు అందుకు కట్టుబడి ఉండటానికి  నిర్ణయము తీసుకుంటారు. కానీ, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఒక సినిమా లో  నిశ్చితార్థము అయిన తరువాత  కథా నాయిక “నాకు ఇంకొకరి మీద మనసు పోయింది” అని చెబుతుంది. అందులో ఇంకొక పాత్ర చెబ్తుంది,”ఎవరికీ ఎప్పుడు ఎవరి మీద మనస్సు వెళుతుందో” చెప్ప లేమని అంటుంది. ఇంక నిశ్చితార్థము విలువ ఏమిటి? పెళ్ళయిన అరువాట కూడా మనస్సు వెల్ల వచ్చు కదా? అందుకు కూడా అంగీకరిస్తామా?

దీనికి పైన ఇంకో మెట్టు.ఒక సినిమా లో కథా నాయిక  ఒక సంగీత వాద్య కారుది మీద  మనస్సు పారేసుకుంటుంది.వేదం పండితుల కుటుంబములో పుట్టిన ఆమెను మరొక  వేదం పండితుడికి ఇచ్చి పెళ్లి  చేస్తారు. సమాగమ సమయములో  వరుడికి ఆమె శక్తి స్వరూపిణిగా  కాన బడుతుందిట. కారణ మొకటే, ఆమె మనస్సు ఈయన మీద లేదు. ఆ విధముగా  ఆమె పరస్త్రీ అయింది. అందుకే ఆమె శక్తి స్వరూపిణిగా  కనిపించింది. అయితే ఒక ప్రశ్న మిగిలి యుండి.  పాణి గ్రహనములో చేయి పట్టుకున్నపుడే  లేదా మంగళ సూత్రా ధారణ సమయము లోనే ఎందుకలా జరగ లేదు. ఒక ప్రముఖ  దర్శకుడి సినిమా చూసినపుడు నాకు వచ్చిన ప్రశ్న ఇది.

ఇది ఆ రెండు సినిమాలేక్ పరిమితము కాదు. ఇంకా చాలా సినిమాలలో టీవీ  సీరియల్స్  లో నిశ్చితార్థము అయి పోయి తరువాత వధువు  మనస్సు మారి పోవడము చూపిస్తున్నారు. హీరో ల కంటే  ఆ కథా రచయితలు పెద్ద హీరో లు అవుతున్నారు. జనానికి తెలియని విశేషాలు కొన్ని ఉన్నాయి  సావిత్రి సత్యవంతుడు చని పోతాడని తెలిసి కూడా  పెద్ద వాళ్ళను  ఒప్పించి, ఆయననే పెళ్లి చేసుకొని, ఆయన కోసమే పోరాడుతుంది. మరి ఈ తరము వారు,పెళ్ళికి ముందే  కాబోయే మొగుడు మొహాన మొత్తినట్లని పించడము, ప్రేమ కంటే వ్యామొహానికిఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము, నిస్చితార్తాలు విస్చిన్నాము కావడము జరుగుతున్నది.

దీనిని విప్లవాత్మకముగా  నిర్మాతలు భావిస్తే అది ప్రజల కర్మ.  ప్రజలు ఎదో ఒక రోజు ఈ విప్లవాన్ని తిరస్కరిస్తే అది నిర్మాతల కర్మ. నిర్ణయాన్నికాలానికే వదిలి వేద్దాము.