Wednesday, February 8, 2017

మన చరిత్ర6

          
గ్రీకుల ప్రాచీన చరిత్ర

అతి ప్రాచీనమయిన  యూరోపియన్ సాంస్కృతిక వ్యవస్థ గ్రీకులకే చెందుతుంది. ఈజిప్టు దేశపు ఔన్నత్యపు ఆఖరి దశలో  సుమారుగా క్రీ పూ ౧౧ వ శతాబ్దములో గ్రీకుల నాగరికత మొదలయింది.ఇక క్రీ శ ౪ వ శతాబ్దము వరకు బ్రిటిష్ వారికి చరిత్రే లేదు.  ౧౧ వ శతాబ్దము వరకు ఉన్న చరిత్ర కూడా నామ మాత్రమె. మనకు తెలిసిన విస్తారమయిన బ్రిటిష్ చరిత్ర నార్మనుల దండ యాత్రనుంది మాత్రమె. పెక్కు యూరప్ దేశాలలో మానవుడు ఆదిమ మానవుడిలా బ్రతుకు తున్నాడు. రోమన్ నాగరికత ఇంకా తలెత్త లేదు. ఈజిప్టు చాలా ఉన్నత స్థితిలో ఉన్నది. అటువంటి దశ లో గ్రీకు నాగరికత యొక్క శైశవ దశ మొదలయినది.
మధ్యధరా సముద్రము లోని  క్రీత్స్/కృతి  ద్వీపము నుండి టర్కీ తీరము వరకు గ్రీకు సామ్రాజ్యము వ్యాపించినది. ఎథెన్స్ (అధీన) నగరము కళలకు కేంద్రమై విలసిల్లినది. హఠాత్తుగా తలెత్తిన ఈ నాగరికతకు ప్రేరేపణ ఏమిటి? వారి సంస్కృతి ఎటువంటిది?
ఎన్ సైక్లో పేడియా బ్రిటానికా లో ఇలా ఉంది.”యూదుల వలే వారు కూడా తాము తిరిగి వెళ్ళుటకు  ఉవ్విళ్ళూరే మాతృ దేశమును హృదయాంతరాళాలలో దాచి యుంచినారు. ఆ మాతృ భూమిని గురించి వారెన్నో గీతాలు ఆలాపిస్తూ ఉంటారు.”
ఆ పుస్తకములో ఇంకా ఇలా ఉన్నది. “దొరియన్లు క్రీ పూ ౧౧ వ శతాబ్దములో  దాడి చేసినారు. గ్రీకుల కళా కౌశలములు వెల్లి విరిసినది ఈ దాడుల తరువాతనే. సుమారుగా క్రీ పూ ౯౦౦ సంవత్సరములో గ్రీకు ప్రపంచములో ఎథెన్స్ ఒక సాంస్కృతిక  కేంద్రముగా విలసిల్లినది.
స్వర్ణము, స్వర్ణ కారులు తక్కువగనే ఉన్నారు. తూర్పు దేశాలనుండి వచ్చిన స్వర్ణ కారులు  అట్టికా లో ఉన్నారు. ప్రాంతీయ స్వర్ణ కారులు కొద్ది మంది మాత్రమె. లెవ్ కాండి దగ్గిర, చాల్సిస్  ఎరిట్రియల మధ్య లెలాంటిన్ మైదానాలలో  లోహపు పరిశ్రమకు సమీప ప్రాచ్య దేశాలతో వ్యాపారమునకు చక్కని రుజువులు కనిపించినవి. ఆ నగరములు క్రీ పూ ౭౦౦ లో పూర్తిగా ధ్వంసము చేయ బడినవి.”
పై సమాచారమును అనుసరించి వేరే సంస్కృతిని  అనుసరించు వారు దాడులు చేసిన తరువాత మాత్రమె గ్రీకుల చరిత్ర  మహోన్నత వైభవ స్థితిని అందుకొన్నదని తెలుస్తున్నది. ఈ దాడులు చేసిందెవరు? ఆక్సస్స్ నదీ తీరమునుండి వచ్చిన ఆర్యులా? యూరప్ లోని దేశ ద్రిమ్మరులా?
ప్రాచీన గ్రీకు చరిత్ర అంటే ప్రాచీన భారత దేశ  చరిత్ర అంటారు పోకాక్ మహాశయులు తన  India in Greece  అనే పుస్తకములో. ఈ మాట అందరికీ ఆశ్చర్యము కలిగించ వచ్చును. కానీ నిజము తెలియాలంటే  ఆయన చెప్పిన మాటలు కూడా పూర్తిగా వినాలి.
“ఆమె(గ్రీకు దేశము) తన భాష మాత్రమె కాదు. తన వేదాంతము, తన ధర్మమూ, తన నదులు, తన పర్వతాలు, తన తెగలు, తన ఆలోచనలలో మార్పులు, తన రాజకీయ జీవితమూ.... ఎలాంటి సంశయము లేకుండా తను భారత దేశము యొక్క పరిపాలనలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తాయి.
పశ్చిమ భారత దేశములో మాయమయిన ప్రతి వంశ వృక్షము గ్రీసులో ప్రత్యక్షమయినది.  గ్రీకుల భౌగోళిక స్థితుల గురించి వ్రాసిన Strabo అబంటిస్ అనే పేరును గురించి వివరిస్తూ వారు ఫోశియన్ నగరములో స్థిర బడి  “అబే”నగరమును  నిర్మించినారని, తరువాత యుబోకా  కు తరలి వెల్లినారని, అందు వలన అబంటేస్ గా పిలువ బడినారని వ్రాసినారు. కానీ “అబే” పదము యొక్క వ్యుత్పత్తిని తెలుప లేక పోయినారు. అయినప్పటికీ ఈ తెగలు ధైర్య, స్థైర్య  వంతులయిన వీరులుగా ట్రాయి నగర్ మైదానాలలో పేరు గాంచినారు. ( హోమర్  ఇల్లియాద్ లో వారి ధైర్య సాహసాలను, నిజాయితీని గురించి ప్రస్తావించినారు)  వారి అసలు జన్మ స్థానమును  గురించి న్యాయము జరుగ వలసి యున్నది. రాజస్థాన్ రాజ వంశావళి (బార్డ్స్)ను చరిత్ర కాదని నిర్ణయించి చరిత్ర కారులు ఈ ప్రాచీన తెగ యొక్క వంశ వృక్షమును తెలుసుకొనే అవకాశము లేకుండా చేసినారు. అబంటీస్ మాళ్వుల యొక్క అవంతికి చెందిన రాజ పుత్ర తెగకు చెందిన వారు. “
పోకాక్ ఇంకా ఇలా న్నారు.”క్రీ పూ ౭౦౦ కు చెందిన గ్రీకు  పలాస్గాన్ మహా రాజు పాలిస్తాన్ రాజ కుమారుడు. పాలిస్తాన్ అంటే పాలీ దేశము లేదా మగధ.”
“అతి ప్రముఖముగా చెప్ప బడిన ట్రోజన్ (ట్రాయి) నగరపు గోడలు పలాస్గయన్ల చేత లేదా సైక్లోపుల చేత నిర్మించ బడినవి. ఆ గోడలను నిర్మించిన కాలానికి హోమర్ పుట్ట లేదు. ఆ కాలములో పలాస(పాలి) గ్రీస్ లో మాట్లాడ బడుతూ ఉండేది. సైక్లోపులు అనే పదము గోక్లోపులు అనే పదమునుండి వచ్చినది. ఈ గోక్లోపుకు మూల పదము గోకుల ప్రముఖ్. వారు యమునా నదీ తెరమున గోకుల దేశములో నివసించిన ప్రముఖులు. ఇది కృష్ణుడు బాల్యములో గడిపిన ప్రదేశము.”
పై మాటలను భారతీయులెవరూ చెప్పా లేదు. ఇంకా గ్రీసు లో మొదట స్థిర పడిన వారిని ఎజియన్లని లేదా డానా లు అని పిలిచే వారు. వీరు దనువు వంశ పరంపరలో వచ్చిన వారు. వీరు దానవులని పిలువ బడే వారు. వారి ప్రత్యేక సంస్కృతి కూడా ఇల్లియద్ లో కాన బడుతుంది.
హెలెన్ అతి లోక సౌందర్యవతి. ఆమె భర్త అయిన మేనేలాస్ కు అతిథి గా వచ్చిన పారిస్ రాకుమారుడి వ్యామోహములో పడుతుంది. ఈ విషయములో పారిస్ ఎటువంటి వ్యతిరేకతను వ్యక్తము చేయ లేదు. ఇద్దరూ రహస్యముగా ఎజియన్ సముద్రము దాటి ట్రాయి నగరమును చేరుకున్నారు.
గ్ర్రేస్ ఒక దేశముగా కనిపించదు. అందులో ఉన్న చిన్న చిన్న పాలకులు ఒకటయినారు. వారి నాయకుడు ఆగమేమ్నన్. వారిలో ఆకిలీజ్ మహా వీరుడు. ఈ సైన్య బృందము తన యుద్ధ యాత్రలో దారిలో ఉన్న గ్రామాలను కొల్ల గోడుతారు. అందమయిన అమ్మాయిలను చెర బడుతారు. చివరకు ఇద్దరు అమ్మాయిల విషయములో ఆగమేమ్నాన్  ఆకిలీజ్ ల మధ్య ద్వేషము ఏర్పడి, ఆకిలీజ్ యుద్ధ రంగమునుండి వెలుపలికి వచ్చేస్తాడు. ఇందులో మనము నీతి/నియమములు లేని ఒక ఆదిమ జాతిని , వారు చేసే ఆకృత్యాలను చూస్తాము.
ఇక ట్రాయి నగర పాలకుడు ప్రయాం.  అతడి పెద్ద కుమారుడు హెక్టార్. హెక్టార్ తన తమ్ముడు పారిస్ చేసిన పనిని నిరసిస్తాడు. కానీ వీలు లేని పరిస్థితులలో రాజ్య  రక్షణ భాధ్యతలో ఉంది పోతాడు. హోమర్ రచనను అనుసరించి ట్రాయి నగరములో రాజ వంశీకుల మీద నగరములో అపరిమితమయిన గౌరవము కనిపిస్తుంది. చక్కని వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇక హెలెన్  చాంచల్యానికి ప్రతీక. హోమర్ ద్వారా రాజకుటుంబమును గురించి తెలుసుకున్న ప్రతియొక్కరికి  రాజ కుటుంబము మీద ఏర్పడిన గౌరవము ఎజియన్ల/గ్రీకుల మీద ఏర్పడదు. చని పోయిన రాజ కుటుంబీకులకు, ముఖ్యముగా హెక్టార్ కు దహన సంస్కారము చేయుటకు రాజ కుటుంబీకులు పడిన తపన ఒక్క సారి భారత సంస్కృతిని గుర్తుకు తెస్తుంది. హెక్టార్ మహా వీరుడు. ఏనాడూ యుద్ధ రంగములో వెనుకకు తిరుగ లేదు. అతని ధాటికి తట్టుకోలేని శత్రు సైన్యము చేత మోసము చేత చంప బడినాడు. బహుశా పోకాక్ హెక్టార్ లో ఒక మాళ్వ రస పుత్రా వీరుడిని చూచినాడేమో?

ఎజియన్ /గ్రీకు వీరులు వేర్వేరు ప్రాంతాల వారయినప్పటికి వారి ప్రధాన ఉద్దేశ్యము ట్రాయి నగర విధ్వంసమే. బాగా ప్రగతి సాధించిన ట్రోజన్ నగరము గ్రీకుల ఆధీనము లోనికి వచ్చినది. తరువాతి కాలములో వారి ప్రభావమే గ్రీకుల నాగరికతకు మెరుగులు పెట్టినది. ఇటువంటి జాతి మాత్రమె తమ పవిత్ర భూమికి తిరిగి వెళ్లాలని జానపద గీతాలు పాడుతున్నదేమో? నిజాయితీ గలిగిన చరిత్ర కారులు  నిజాన్ని తెలుసుకోవాలి.
This closes the series on our history

Friday, February 3, 2017

ఆర్యులు ఎక్కడినుండి వచ్చినారు?

                                                    
.


“వారాశించే దానిని  గూర్చి కలలు కంటారు. ఆ కలలే నిజమని నమ్ముతారు” అంటారు చిల్లింగ్ వర్త్. .”భారతీయులలో మానసిక విభజనను కోరిన వారు ఆర్య ద్రావిడ సిద్ధాంతమును ప్రతిపాదించినారు.  వారి ప్రతిపాదన  ప్రకారము ఈ దేశములో మొదట  తురీయులన బడే వారు ఉండే వారు. వారిని కొండల పైకి అడవుల లోనికి తరిమి వేసి, ద్రావిడులు  తమ కొత్త సంస్కృతిని ఏర్పరిచినారు. ఆర్యులు పశ్చిమ సరి హద్దుల నుండి వచ్చి, ద్రవిడుల నగరాలను ధ్వంసము చేసి, వారిని దక్షిణ దేశానికి తరిమి వేసినారు. ఈ విధముగా ఉత్తర భారతాన ఉన్న వారు ఆర్యులు, దక్షణాన ఉన్న వారు ద్రవిడులు మరియు కొండలలో కోనల్లో ఉన్న వారు తురీయులు. సుమారు క్రీ శ ౧౭౦౦ లో బాతిలోమ్ హసీ మేల్ బర్గ్ ఈ వాదనకు మూల పురుషుడు. ౧౮౨౪ లో  కాల్డ్వెల్ ఈ వాదనను సమర్థించినాడు. రెవరెండ్ పోప్ హ్యుజన్ హుల్స్ జ్యూవన్  బార్కీ , ఫాదర్  హెన్రీ మున్నగు వారు దీనిని ప్రచారము లోనికి తెచ్చినారు. సుమారుగా ౭౦౦ సంవత్సరాలు ముస్లిం పాలకులు సాధించ  లేని భారతీయ విభజనను బ్రిటిష్ వారు ౨౦౦ సంవత్సరాలలో  కొంత వరకు సాధించ గలిగినారు.
అస్సాం(అహోం)  లోని వారు పొట్టిగా ఉంటారు. పంజాబ్ వారు ఆజాను బాహులు.  కాశ్మీరము  వారు తెల్లగా అందముగా ఉంటారు. భూమధ్య రేఖకు దగ్గిరగా ఉన్న వారు  నల్లగా ఉంటారు. ఇన్ని రకాల ప్రజల సమాహారమే భారత దేశము. ఈ అందరికీ శ్రీ రామ చంద్రుడు మర్యాదా పురుషోత్తముడే, శ్రీ కృష్ణుడు మహాయోగి మాత్రమె గాక భక్త జన హృదయుడు.  మహాదేవుడు అందరికీ ఆరాధ్యనీయుడు. అందరూ అష్టాదశ పురాణాలనే చదువుతారు, ఆ పుణ్య క్షేత్రాలనే దర్శిస్తారు, ఆ నదుల లోనే స్నానము చేస్తారు. ఒక మాట చెప్పాలంటే నదుల స్నాన ఘట్టాలు, పుణ్య క్షేత్రాలు  అందరూ కలిసే కూడలి ప్రదేశాలు అయినాయి. రూపు రేఖలే మనుషుల ఔన్నత్యాని నిర్ణయిస్తాయన్న  వెఱ్ఱి భ్రమకు ఆర్య ద్రావిడ విభజన మరింత బలాన్ని చేకూర్చింది. సాధన లోనికి తీసుకొని రాలేని  శాస్త్రీయ  పరిజ్ఞానము ఎటువంటి వెఱ్ఱి తలలనైనా వేయించ గలదు. అన్నిటికీ ఫలితమొక్కటే. జాతీయ భావము స్థానములో బావ దాస్యము వేళ్ళూని నిలిచింది.
ఆర్యులు అందగాళ్ళు ఆజాను బాహులు, తెల్లగా ఉంటారు. ద్రవిడులు నల్లగాఉన్తారు, పొట్టిగా ఉంటారేమో? మరి ఆర్యులు/ద్రవిడులు ఆరాధించే రామ/కృష్ణుల యొక్క రంగేమిటి?తెలుపేనా? ద్రావిడ నాయకుడుగా పేర్కొన బడ్డ రావణుడు  ఎవరికీ పుట్టినాడు. ఆయన ఆరాధ్య దైవమెవరు? భాగవత పురాణములో చెప్ప బడి దక్షిణ భారత దేశాన్ని పాలించిన ద్రావిడుడు అను పేరు గల రాజు ఏ పరంపరనుండి వచ్చినాడు?
వాల్మికి రామాయణములో సీతా మాత శ్రీ రాముడిని ఆర్య పుత్రా! అని ఎన్నో సార్లు పిలిచినట్లు ఉంటుంది. మర్యాద పూర్వకముగా పిలుచుటకు ఉపయోగపడే ఆర్య శబ్దము జాతి పేరుగా మారినది. మరొక రాజు యొక్క పరిపాలనా క్షేత్రము ఆ ప్రాంత ప్రజల జాతి పేరుగా మారినది. మరి ప్రముఖ ద్రావిడ భాషగా చెప్ప బడుతున్న తమిళమునకు  వ్యాకరణ కర్త అయిన అగస్త్య ఋషి వర్యుడు  ద్రవిడుడా? వైదిక పరంపరలో కనిపించడా?
దేహమును మనస్సు  వేర్వేరుగా భావించిన పాశ్చాత్య  శాస్త్రజ్ఞుల లో కొందరు  మనస్సులో కలిగే తీవ్ర వికల్పములే భౌతికముగా  కాన్సర్ వ్యాధికి కారణమవుతుందని  గుర్తించినారు.  అటువంటి వారిలో కొందరు మానసిక సామీప్యత కంటే రూపు రేఖలే జాతిని  నిర్దేశిస్తాయని తెలుపుతూ  జాతి భేదమనే మరో కాన్సర్ ను ప్రవేశ పెట్టినారు. మనుషులను, మనుషుల బృందాలను విశిష్ట లక్షణాల ఆధారముగా కలుపుకుంటూ పోయే వారు దేవతలు, విడ గొడుతూ పోయే వారు రాక్షసులు.
హరప్పా మేహన్  జోడారో త్రవ్వకాలలో ఒక చోట  ౨౬ మానవ ఆస్థి పంజరాలు కనిపించినాయిట. అందులో ఒకడు మెట్లనుంది దిగుతూ, మరొకరు పైకెక్కుతూ మరనిన్చునట్లు నిర్ధారించుకొన్నారు. ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడి యున్న మానవ కంకాళాలను చూచి, అనాగారికులయిన ఆర్యులు నాగరికులకు చెందినా హరప్పా , మేహెన్ జోదారో  నగరాలను ధ్వంసము చేసినారని  వీలర్, ఫిగేట్ లు నిర్ణయానికి వచ్చేసినారు. ఈ నగరాలు శంబరులవని, వీటిని ఆర్యులు నాశనము చేసినారని ఫిగేట్ చెప్పినాడు. కానీ శంబరులు పర్వత వాసులని ఋగ్వేదం చెబుతుంది. ఈ విషయము ఫిగేట్ గుర్తించ లేదేమో?
నదులు కాల గమనములో వరదలు వచ్చుట పరివాహ మార్గమును మార్చుకొనుట అందరికి తెలిసిన విషయమే. ఈ నగరాలు సింధూ నదికి తీవ్రమయిన వరదలు వచ్చినపుడు  నాశనము చేయ బడి యుండ వచ్చునన్న విషయము వారికి తెలియదా? కానీ వారి లక్ష్యము వేరే కదా.
   ఇటీవల అరేబియా సముద్రములో సాధించగా దొరికిన ద్వారక నగరమునకు సంబంధించిన  రాతి చెక్కడాలకు హరప్పా, మేహన్ జోదారో, లోతల్  లో దొరికిన చెక్కడాలకు పోలికలు కన్పించినవి. అవి ఒకే నాగరికతకు సంబంధించినవన్న భావనను కల్గించినవి. ఆ సిద్ధాంతమును విశ్వసించే వారిలో ఏ విధమైన మార్పు వచ్చినట్లు కనిపించదు.
ఇంకా ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చిన వారయితే అక్కడ ఆ పరంపర చిహ్నాలేవీ లేవేమి? ఎవరికైనా వారు తమ వెంట నిలుపుకున్న వారసత్వము వారిదే అవుతుంది. వారు అది ఎప్పుడో ఎవరి దగ్గిరనుండో సంపాదించారన్న సిద్ధాంతానికి విలువ లేదు. వేదాలలో సరస్వతి, సింధూ నదుల ప్రస్తావన తప్ప మధ్య ప్రాంతములో ఏ ప్రదేశము యొక్క ప్రస్తావన లేదన్న విషయాన్ని గుర్తించాలి.
ఆర్యుల ప్రధాన భాష సంస్కృతము. సంస్కృతమే గాక ప్రాకృత భాషలు కూడా వాడుకలో ఉన్నట్లు రామాయణము చదివిన వారికి తెలుస్తుంది. ప్రపంచములో ప్రధాన యూరప్ ఖండ భాషలన్నిటికి మాతృకలుగా చెప్ప బడుతున్న గ్రీకు, లాటిన్ భాష పదాలతో సంస్కృతముకు ఉన్న నిర్దుష్టమయిన  సంబంధమును చూచి విదేశీ భాష కోవిదులు నివ్వెర  పోయినారు. తర తరాలుగా మార్పు చెందని సంస్కృత వ్యాకరణము వారిని ఆశ్చర్య పరచినది. అయినా భారత దేశము నిలుపుకున్న సంస్కృతమును యూరోపియన్ భాషల మాతృకగా అంగీకరించ లేక  సంస్కృత భాషకు యూరోపియన్ భాషలకు ఒకే మాతృక ఉన్నాడని ప్రతిపాదించినారు. ఈ విధముగా ఒకే బృందము  మధ్య ఆసియా నుండి  బయలు దేరి వేర్వేరు శాఖలుగా చీలి అందులో ఒక శాఖ భారత దేశమునకు వచ్చినదని ప్రతిపాదించినారు. అయినా అందులో ఏకాభిప్రాయము లేదన్న విషయాన్ని క్రింది వ్యాఖ్యలు సూచిస్తాయి.
“ఎక్కడయితే సంస్కృతము, జెండ్ (పార్సీ) భాషలు మాట్లాడుతారో అక్కడే ఆర్యుల జన్మ స్థానముంది. లేదా ఉండ వచ్చును”అన్నారు హౌఫర్
“జెండ్, గ్రీక్, లాటిన్, గోతిక్ భాషలన్నియు వేర్వేరు కాలములలో సంస్కృతమునుండి జన్మించి ఉంటాయి” అన్నారు కర్జన్.
“మనము ఒప్పుకున్నా , ఒప్పుకొనక పోయినా , అతి ప్రాచీన భాషగా సంస్కృతమును చూడ వలసి యున్నది.” అన్నారు బీం అనబడు చరిత్ర కారుడు.
“యూరప్ లోని అనేక జాతుల మూలమునకు తిరుగు లేని ఋజువు సంస్కృతమే అవుతుంది” అన్నారు లూయీస్ జకోలియాట్.



.