Thursday, March 28, 2024

 

                                                   శీలము 

          విద్యా విధానమనగానే మనకు ముందు గుర్తుకు వచ్చేది వ్యక్తి  శీలము.  ఇది అంటే శీలము విద్యలో భాగము కాదా?

          విద్య వినయాన్ని ఇస్తుందని మన పూర్వీకులు చెప్పినారు. ఈ నాడు ఈ మాట నిజమేనా?

          ఎక్కడో  ఏదో పొరపాటు జరిగినది.  మన యొక్క పద జాలము యొక్క అర్థాలు మారి పోయినాయి.

          కొన్ని ఏండ్ల క్రిందట గ్రంథాలయము లో కూర్చుని వార్తా పత్రిక చదువుతున్నాను. ఇరువురి మధ్య తీవ్రముగా ఏదో చర్చ జరుగుతున్నది. క్రమ క్రమముగా కంఠము యొక్క తీవ్రత పెరిగింది.  వాళ్ళ చర్చను నేను కూడా వినడము మొదలు పెట్టినాను. ఒక రచయిత్రి గురించి  చర్చ చాలా తీవ్రముగా జరుగుతున్నది.  వ్యక్తిగతముగా శీలమును వదిలి వేసిన ఒక రచయిత్రి తన రచనల ద్వారా ఎన్ని నీతులు చెప్పినా సమాజానికి ఒరిగేదేమిటి? ఇది మొదటి వాడి  ప్రశ్న. వ్యక్తిగత  విషయములతో మనకు సంబంధము లేదు.  ఆమె చేసిన అద్భుత మయిన సమాజానికి పనికి వచ్చే  రచనలను మాత్రమే మనము పట్టించుకోవాలి. ఇది రెండవ వ్యక్తి యొక్క వాదన. ఇద్దరూ జుట్టు పట్టుకొని పట్టుకొనే స్థాయికి వస్తే  చుట్టూ పక్కల వారు అందరూ వారికి సర్ది చెప్పి పంపించి వేసినారు.

          ఆ సమయములో  నాకొక సంఘటన గుర్తుకు వచ్చింది. నా చిన్నప్పుడు (అప్పుడు నేను ఏడవ తరగతిలో ఉన్నాను.)నా కొక సైన్స్  మాస్టారు ఉండే వారు. సైన్స్  పాఠాలు అద్భుతముగా చెప్పే వారు. పిల్లలు నిశ్శబ్దముగా వినే వారు. ఒక సారి అతడి వ్యక్తిగత జీవితములో కొన్ని దురదృష్ట కర  సంఘటనలు జరిగినాయి. అంతే , అతడు పాఠాలు ఎంత బాగా చెబుతున్నా పిల్లలు వినడము మానేసి గొడవ చేయడము మొదలు పెట్టినారు. దీనిని  ఏమిటంటారు?

          మనము ఎన్ని  నీతులు చెప్పినా  విద్యార్థులు శ్రద్ధగా వింటారు. మనమీ వాటిని అనుసరించటము లేదని తెలిసిన తరువాత  మన మాట వారు వినరు. అవసరమయితే వినినట్లు  నటిస్తారు.

          “సారా  జహామ్  సే  అచ్ఛా  హిందూ సీతాన్   హమారా “ అన్నాడు ఇక్బాల్ మహా కవి. కానీ, తాను  అని మాత్రము పాకిస్తాన్ వెళ్ళి పోయినాడు.  బంకిమ్ బాబు తన ఆనంద మఠం రచనలో  వన్డే  మాతరం అని  దేశ ప్రేమికులచేత పాదిస్తాడు.  తన జీవితములో దేశ ప్రేమికుడిగా జీవించినాడు. అందుకే వన్డే మాతరమ్  గీతము స్థాయి  మొదటి దానికి రాదు.

          ఇవన్నీ గమనిస్తే మన కొక   విషయము తెలుస్తుంది. శీలము లేని వాడు నటిస్తాడు,శీలమున్న వాడు జీవిస్తాడు. మనకు కావలసింది నటనా లేక జీవితమా?

 

                          

                            అభిప్రాయము

నన్ను  గతములో , వర్తమానములో  నడిపించిన  మరియు  భవిష్యత్తులో నడిపించే  మహాత్ములకు  పెక్కునమస్కారములు.

పల్లెటూరిలో పుట్టి రాకృతి  రసాస్వాదన  చేస్తూ  అనుక్షణము  కొత్త కొత్త మార్పులను ఎదుర్కొంటూ 13 జూన్  నెల  శ్రీముఖ జ్యేష్ట శుద్ద  నవమి నాడు ఇది వ్రాయుటను మొదలు పెట్టాను. దీని తరువాత చాలా వ్యాసాలు వ్రాసాను. వాటిని  నా బ్లాగ్ లోని వ్యాసాల సంపుటి లో పెట్టడము కూడా జరిగినది. కానీ దీనిని పట్టించు కొ లేదు. ఇటీవలే దీనిని  తయారు చేయడము మొదలు పెట్టినాను.

ఈ నాడు  రతి యొక్కరూ  అంటే  నేను, నీవు  మరి ఎందరో అందరికీ ఒక అలవాటు అయింది. అలా చెప్పుకుంటున్నారు, ఈ లోకము పాడయి  పోయిందనీ, ప్రతి యొక్కరిలో స్వార్థము  పెరిగిపోయిందని,  అలా చెప్పడము తో తమ భాధ్యత తీరిపోయిందనీ  అనుకుంటున్నారు, లేదా భాధ్యత నుండి తప్పుకుంటున్నారు.

గౌతమ బుద్ధుడిని, కొంత మంది ప్రశ్నించి  నారుట, “మరణానంతరము జీవితమునడా?” అని. “ముందు ఈ జీవితమును పట్టించుకొనన్ది.’ అని చెప్పినారుట. మిగిలిన  లేదా  అనవసర ఆలోచనలు ఇప్పుడు అనవసరమన్నట్లు.  వచ్చిన వారు వెంటనే తమ  చిట్టా లో వ్రాసుకున్నారుట,” మరణానంతర జీవితము లేదని బుద్ధుడు చెప్పినాదని.” ఇక బుద్ధుడి పేరు మీద ఉన్న జాతక కథలు మరణానంతర/పునర్జన్మను సూచిస్తున్నాయన్న విషయాన్ని వారు మరిచి పోయినారు. లలిత విస్తారమనే బౌద్ధ గ్రంథములో తన గత జన్మ గురించి బుద్ధుడు ప్రస్తావించినట్లు ఉన్నది. బౌద్ధ గరువులు(టిబెటన్ లామాలు) తరచుగా పునర్జన్మ గురించి ప్రస్తావిస్తారు. కానీ బుద్ధుడి ఆలోచన ప్రకారము, మరణమూకంటే  ముందు తరువాత ఏమీ ఉండదని హడావుడి చేసి చెప్పేస్తారు మన దార్శనీకులు మరియు చరిత్ర కారులు. 

పూర్వ కాలములో గురువులు శిష్యులకు ఎంత అవసరమో అంతా వరకే  బోధించే వారు. కానీ, ఈ నాటి శిష్యులు “గురువు గారు! మీరు చెప్పగలిగినంత వరకూ చెప్పండి, ఎరుకొన గల్గినన్న విషయాలను మేమే వేరుకుంటామని అంటున్నారు. వీరే అసలాయిన గురువును మించిన శిష్యులు. శిష్యులకు ఏమి  ఇవ్వాలో తెలియని గురువులు, గురువుకే పాఠాలను చెప్పాలనుకొనే శిష్యులు , ఇదీ మన నూతన విద్యా విధానములో మార్పు, ఇలాగే నడుస్తూ ఉంది.

నా చిన్నప్పుడు గోడల మీద విద్యార్థి సంఘాలు కొన్ని నినాదాలు వ్రాసినాయి. అవి ఏమిటంటే,

1.     మాకు శాస్త్రీయ విద్యా విధానము కావాల.

2.    విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి 1:20 ఉండాలి.

మొదట ఇదేనా శాస్త్రీయ విద్యా విధానము అని అనిపించినది. తరువాత అర్థమయింది, ఇది గాని వస్తే నేర్చుకొనే విషయాలు ఏమయినా నిరుద్యోగ సమస్య మాత్రము తీరిపోతుంది అని.

ఈ వ్యాసము కొంచెము అసంపూర్తిగా ఉంది.