Tuesday, February 18, 2014

అనుభూతి2

                                                    


         
ఇవంతా నిజమేనా? యని రాజీ అడిగింది. ఇన్ని విషయాలు మీరెప్పుడూ చెప్ప లేదు. అయినా,  ఎవరో ఎదో చెబుతారు, మనము తలాడించి వచ్చేస్తాము, ఆ తరువాత అంతా మరిచి పోతాము. అని యన్నాది.
అమ్మయ్యా! ఇన్నాళ్ళకు నీ నుండి ఒక ప్రశ్న వచ్చినది. నేను  ఎప్పుడు చెప్పాలనుకున్నా, నీవు అంత ఆసక్తి చూపించ లేదు, మొదట్లో నే వాటిని ఖండించే దానివి. అయినా నీ అనుమానాలన్నీ ఆయనే తీరుస్తాడు. రేపు మళ్ళీ వెళ్ళుతున్నాము  కదా!
ఎలా కుదురుతుంది? మనకు ఆయనతో మాట్లాడే అవకాశము ఉంటుందా?
ప్రయత్నము  చేద్దాము. కుదరక పొతే నీకు నేనే దిక్కు.



మర్నాడు మళ్ళీ వెళ్ళినపుడు గోపాలము నిర్వాహకులను కలవాలని వెళ్ళినాడు. స్వామీజీ ని వ్యక్తిగతముగా కలవాలని అక్కడికి వెళితే అక్కడ తన లాగే చాలా మంది యున్నారు. నిర్వాహకులు రాత్ర ౧౦ గంటల వరకు అందరికి అందు బాటు లో యుంటారని అప్పుడు కలియ వచ్చని చెప్పినారు.
ఇక్కడ రాజీ కి అన్నీ చాలా ఆశ్చర్యముగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ నిజముగా యున్నాయా? ఇవి కన్పిస్తాయా? లేక పొతే ఇవి అన్నీ కూడా జానపద కథల లాంటివేనా?
ఈ విషయాలు తెల్సుకున్నందు వలన లాభమేమిటి? అందరూ మాట్లాడే మోక్షము వీటి వలన లభిస్తుందా?
ఎప్పుడూ తనకు చిరాకు కలుగుతుంది. దీనికి కూడా వైద్యము ఉందా?
ఈ లోపల ఉపన్యాసము మొదలయింది.
   ఈ దేహాన్ని భౌతిక దేహమన్నారు. దీనిని పై వాటికి అనుసంధానము చేయడానికి యుండే కంటికి కనిపించని దేహాన్ని సూక్ష్మ లేదా లింగ దేహము అని అన్నారు.
          ఈ దేహానికి భౌతిక మయిన అనుభవము కావాలి. సమయానికి తిండి కావాలి, కాస్త విశ్రాంతి కావాలి అవి నెరవేరిన తరువాత నిద్ర పోవాలనుకున్న దీనిని కామ దేహము కొన్ని అనుభవాలకొరకు ప్రేరే పిస్తుంది. అది కోరిక కావచ్చును, ఆవేశము కావచ్చును. ఈ విధముగా కామ దేహము దీనిని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. కామ దేహాన్ని కేంద్రీకరిస్తే పనులవుతాయి, కానీ ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది.. తక్కువ స్థాయి తాంత్రికులు దీనినే ఉపయోగిస్తారు.
          దీనిని ప్రశాంత స్థితికి తీసుకొని వస్తే మనలో వివేకము మేలుకుంటుంది. మనో దేహము ముందుకు వస్తుంది. అందులో కూడా విపరీతముగా ఆలోచించి తల నొప్పి తెచ్చుకొన వచ్చును. అదుపులో యున్న మనస్సు మంచి స్నేహితుడు లాటిది.
          ఋషులు మనస్సును అగ్నితో పోల్చినారు. ఘర్షణ లేదా రాపిడి వలన వచ్చింది చాలా తక్కువ స్థాయి దయితే మనస్సు ఏడవ స్థాయికి (అంటే అన్నిటి కంటే పై స్థాయి ) చెందిన అగ్నిగా ఋషులు భావించినారు. అటువంటి మనస్సును మచ్చిక చేసుకుంటే అది మనకు ఎటువంటి పనులనయినాచేసి పెడుతుంది.
ఇంతలో ఒకరు ఒక చీటీ తెచ్చి ఆయన కిచ్చినారు. ఆయన మళ్ళీ కొన సాగించినారు.
ఇప్పుడే ఒక ప్రశ్న వచ్చినది. ఇవంతా నిజముగా యున్నాయా, లేదా ఇది కొంత మంది  సృష్టించిన ఒక కల్పనా? అని. మీరు ఎటువంటి మొహమాటము లేకుండా అడిగితేనే మేము చెప్పే వాటికి విలువ యుంటుంది. మీరు పరీక్షించి తెలుసుకొనే స్థితికి వచ్చి, మీరు ఋజువు చేయ గలిగితేనే మీకు ఇంకొకరికి చెప్పే హక్కు యుంటుంది. ఫలానా వారు ఇలా చెప్పినారు అని మీరు నమ్మ వచ్చును. కానీ మీరు ఇంకొకరికి చెప్పాలంటే ముందు మీకు మీరు పరీక్షించు కోవాలి.
ఈ విద్యలు భారత దేశపు ఋషులకు పూర్తిగా ఎరుకలో యున్నవే. కానీ ఆశ్రమాలకే పరిమితమయినాయి. ఈ ఆధునిక కాలములో ఫిలిప్పీన్ కు చెందిన మాస్టర్ చోవా కుక్ సూయి ద్వారా ఈ విద్య  ఒక ప్రణాళిక రూపములో నేర్ప బడుతున్నది. ఆ పద్ధతులతో మీరు ఏ విభిన్న దేహాలను మీ చేతులతో తాకి చూడ వచ్చును. మరొక శిక్షణ ద్వారా మీరు వీటిని మీ కళ్ళతో చూడ వచ్చును. వీటికి సంబంధించిన సాహిత్యము మీకు దివ్య జ్ఞాన సమాజములో విస్తారము గా దొరుకుతుంది. అయినా మీ ఆసక్తి ననుసరించి మీకు కొన్ని చిన్న పద్ధతులను సూచనా ప్రాయముగా ఒక రోజు నేర్పించ గలను.  ఇంకేమయినా ప్రశ్నలుంటే అడుగ వచ్చును.
          ఇప్పుడు అందరూ ధ్యానము, ధ్యానము అని అంటునారు. ధ్యానమంటే ఏమిటి? ఎలా చేయాలి? రాజీ లేచి అడిగింది.
          అందరూ ధ్యానము చేస్తున్నా మన్న వారే. కానీ ఈ ప్రశ్నను ఎవరూ అడగ లేదమ్మా! తనకు నచ్చిన వాటి మీదనే దృష్టి పెట్టి యుంచి ఆ దృష్టి మరల్చకుండా అది తన కు సిద్ధించే వరకు అలాగే యుండడము ధ్యానములో మొదటి మెట్టు. కానీ అది సరి అయిన పధ్ధతి కావచ్చును కాక పోవచ్చును.  దానికొరకు ఆవేశము గా ప్రయత్నము చేస్తే మనో దేహము పాత్ర కంటే కామ దేహము పాత్ర ఎక్కువ యుంటుంది . ఇది సరి అయిన పధ్ధతి కాదు.మన మనస్సులోకి ఇంకా లోతుగా వెళ్ళాలి. జీవితములో సంఘర్షణ ఎదురయినపుడు మనస్సు దానినే తలచుకొని క్రుంగి పొతున్నపుడు, ఆ మనస్సుకు శిక్షణ ఈయాలి. ఈ సమస్యలకు దారి చూపేది ధ్యానము. దేని పైనా దృష్టి పెట్ట వచ్చును. కానీ మనిషికి జీవిత పర్యంతము వచ్చే తోడూ శ్వాస మాత్రమే. అందుకే పతంజలి కానీ, విజ్ఞాన భైరవ తంత్రములో శివుడు కానీ శ్వాసను ఆలంబనగా తీసుకోవడాన్ని సుచిన్చినారు.
          సమస్యలతో కొట్టుకుంటున్న మనస్సు ఒక సారి ఈ ఆలంబనను పట్టుకోగానే నిశ్చలత్వము లోనికి వెళుతుంది. అందు వలన మనస్సు ఎటువంటి శక్తిని ఉపయోగించుకోలేదు.
          ఈ రకముగా ప్రశాంతత మొదటి ప్రయోజనముగా లభిస్తుంది. అందుకే గుండె పోటు ఉన్న వాళ్ళు ధ్యానము వైపుకు వస్తారు.
          భౌతిక దేహము తో ఎదుటి వాళ్ళను తిట్టి, కొట్టి  తనకు కావలసినవి సాధించు కొన వచ్చును. కామ దేహముతో ఆవేశము తో సాధించు కొన గలిగిన కోరికలను తీర్చు కొన వచ్చును. కానీ ప్రశాంతముగా మనస్సు నుప యోగించు కొనుట ఎవరికీ చేత కావటము లేదు.  మనస్సు ఆలోచన  లోనికి దింపి తిప్పి, తిప్పి, అలసట కలిగించి నిద్ర లోనికి దింపుతుంది.
          దానిని నియంత్రించుకుంటే ప్రశాంతత ఏర్పడుతుంది. దీని వలన ఇతర సూక్ష్మ దేహాలు కూడా శుద్ధి అవుతాయి. మనో నేత్రము తెరచుకొని మనము అనుకున్న స్థలాలను, దృశ్యాలను మన కామ దేహము ఎక్కడికి కదలకుండానే చూడ వచ్చును. మరికొంత ముందుకు వెళ్లి మానసిక సృజనాత్మకత లేదా క్రియేటివ్  విజువలైజేషన్ ద్వారామన ఉహాలను యథార్థము చెసుకొన వచ్చును. ఇప్పుడు దీనిని ఒక విద్య గా ప్రచారము చేస్తూ కొంత మంది లక్షలు ఆర్జిస్తున్నారు. అయినా మనో దేహమును వాడుకొనుట ఎవరికీ సాధ్యము కావటము లేదు. ఆయన ఆగినారు.
          ఇంకొకరు లేచి భౌతిక, కామ దేహములను ఉపయోగించు కొనుటగురించి చెప్పినారు. అలాగే  మనో దేహమును ఉపయోగించుకోనుట  గురించి మరి కాస్త వివరించండి.
          అదే చెప్పాలను కున్నాను. ఎదో యొక ధ్యాన పద్ధతిలో మనస్సును ప్రశాంతత కు తీసుకొని వెళ్ళండి. అప్పుడు మీకు చాలా ఇష్టమయిన శబ్దాలు లేదా దృశ్యాలు మరేదయినా కావచ్చును, మీకు అనుభవము  లోనికి వస్తాయి. వాటిని మీరు పట్టించుకోకండి.  అప్పుడు మీకు ఏవి అవసరమో అవే కనిపిస్తాయి. ఇంతకు ముందు మీరు మీకు గుర్తు యున్నారు. ఇంకా మీరు ఎవరో మరిచి పోయే స్థాయిలో ఒక ఆనంద స్థితి వస్తుంది. ఇది ఒక అద్భుతమయిన అనుభూతి. అది దేహానికి సంబంధించ్నది కాదు. సుఖము కాదు.దానిని వర్ణించుటకు మాటలుండవు. దీనినే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని  వేద ఋషులు చెప్పినారు.. అంటే ఎక్కడయితే దేని నయితే నిర్వచించడానికి మాటలుండవో ఆ స్థితి.
          అంతే కాదు, అక్కడ అద్భుతమయిన వెలుతురు. అక్కడ సూర్యుడుండడు, చంద్రుడుండడు, మనము జీవించే లోకము కూడా అక్కడుండదు. అక్కడున్నదొక్కటే, ఆనందం, ఆనందం, ఆనందం. ఆ స్థితి లో మీరు ఒక ఋషి స్థాయిని అందుకుంటారు.
          అప్పుడు మీ మనో దేహము మిమ్ములను ఆడించదు. అది మీ చేతిలో బానిస గా పని చేస్తుంది. ఆ అనుభూతిని మీరందుకున్న తరువాత మీ మనస్సు మిమ్ములను అనుసరిస్తుంది. మీరనుకున్న వాటిని సృజిస్తుంది.    చాలా? స్వామీజీ ఒక తాదాత్మ్య స్థితి లోనికి వెళ్లి పోయినారు.
          అనుమానాలతో యున్న రాజీ కూడా తను కూడా ఒక తాదాత్మ్య స్థితిని చవి చూసింది.
                              


   -----------------------------------------------------
ఉపన్యాసము బాగుందా? ఇంకేమన్నా ప్రశ్నలున్నాయా?

ఇంక అడిగేది, వినేది ఏమీ యుండవు. చేయడమే. రాజీ పైకి లేచినది.

Monday, February 10, 2014

అనుభూతి1

                                                       


గోపాలం చిన్నప్పటి నుండి ఒక విలక్షణమయిన వ్యక్తీ.  ఎప్పుడూ , ధ్యానము, యోగము,  సాధన  ఇటువంటి పదాలనే వాడే వాడు. అలాగని తన చదువులో ఎప్పుడూ వెనుక పడ లేదు. విద్యార్థిగా ఎప్పుడూ ముందు బల్ల మీదనే కూర్చునే వాడు. చదువులో కూడా అందరి కంటే ముందు ఉండే వాడు. అందుకే వెనుక ఎన్ని వ్యాఖ్యలు చేసినా అందరూ గోపాలం ముందు మాత్రము జాగ్రత్తగా మాట్లాడే వారు. అంతే కాదు, గోపాలం చాలా స్నేహ శీలి. పరీక్ష ముందు రోజు కూడా తన క్లాస్ వాళ్ళే కాదు, వేరే వాళ్ళు ఎవరు వచ్చినా రాత్రంతా కూర్చొని అయినా వాళ్ళ అనుమానాలను తీర్చి పంపించే వాడు. అందుకే గోపాలం మీద నేరుగా కామెంట్ చేయడానికి ఎవరికీ ఇష్టముండేది కాదు.
           మాస్టర్  డిగ్రీ  చేసిన తరువాత ఒక కాలేజి లో లెక్చరర్ గా చేరినాడు. తల్లి దండ్రులు కూడా కొడుకు ఎక్కడ బైరాగులలో కలిసి పోతాడేమో అన్న భయముతో నచ్చ చెప్పి, లేక బెదిరించి పెళ్లి చేశాము అని, అనిపించినారు. భార్య పేరు రాజేశ్వరి. అందరూ రాజీ అని పిలిచే వారు. రాజీ అందరితో బాగా కలిసి పోయేది, చాలా కష్ట పడి ఇల్లును చాలా శుభ్రముగా యుంచేది. కానీ ఆమెకు ఒక విషయము అర్థమయేది కాదు. తన మొగుడు (ఇక్కడ భర్త అనే పదము వాడ తలచుకోలేదు ) ఉదయము సాయంత్రము క్రమముగ సంధ్యా వందనము చేసుకుంటున్నాడు, అన్ని విషయాలలో శ్రద్ధగా యుంటున్నాడు.  కానీ, అప్పుడప్పుడు, గంటల కొద్దీ కళ్ళు మూసుకొని కూర్చుంటాడు, అదేమంటే ధ్యానమంటాడు. కాసేపు కబుర్లు చెబితే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థము కావటము లేదు. ఇదంతా ఏమిటో తెలుసుకోవాలని అనిపించ లేదు, అందుకని వివరాలను అడుగ లేదు. కానీ తనకు చాలా చిరాకు వేసేది.  
          అద్దె ఇళ్ళలో యున్న గోపాలం ఒక చోటు చూచుకొని అక్కడే తన అనుస్థానాలను చేసుకొనే వాడు, వీలయినప్పుడల్లా ధ్యానము చేసుకొనే వాడు. చాలా సార్లు రాజీ చేత కూడా ధ్యానము చేయించాలని చూచినాడు. తను ఎటువంటి ఆసక్తి చూపించ లేదు. అంతే కాదు, తను ధ్యానము చేసే టప్పుడు బాగా ఆకలి వేస్తే, కేకలు వేసేది. అందు వలన ధ్యానము చేసేటప్పుడు, రాజీ కి ఆకలి వేసిందేమో లేదా వేస్తుందేమో అన్న భయము కూడా తనలో యుండేది. అందుకని, ఆ సమయములో ధ్యానము కుదిరేది కాదు.
          ఈ లోపల కుటుంబము కాస్త పెరగడము, పిల్లలు, వారి వ్యవహారాలూ, వీటితో గోపాలం తన వ్యాపకాలలోకాస్త వెనుక బడినాడు.. పిల్లలు ఎదిగి, దూరపు ఊళ్ళలో ఇంజనీరింగ్ చదువుల్లో చేరిన తరువాత, మళ్ళీ కాస్త వెసులు బాటు దొరికింది. పిల్లలు దూరమయిన తరువాత రాజీ కి కూడా  ఎదో కాస్త వెలితి కన బడ సాగినది.  అందుకని, ఇప్పుడు ధ్యానమంటే ఏమిటి? ఎలా చేయాలి? చేస్తే ఏమొస్తుంది? ఇటువంటి సిద్ధాంతపు ప్రశ్నలు వేసేది. అభ్యాసముకు మాత్రము బద్దకమే, ఇంట్లో పనులు చక్క బెట్టడానికి మాత్రము బద్ధకించేది కాదు.
          తనుండేది, అద్దె ఇండ్లలో. ఇల్లు మారిన ప్రతి సారీ, కొత్త వాతావరణము లో ధ్యానము కుదిరేది కాదు. ఆ సమయములో బాంకులు ఇల్లు కట్టుకోవడానికి అప్పులు ఈయడము మొదలు పెట్టినాయి.  ఒక స్థలము కొని బాంకు అప్పు తో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. అందులో ధ్యానము చేసుకోడానికి ఒక చిన్న గదిని తన ఆధీనములో ఉంచుకున్నాడు. అక్కడ మరే ఇతర పనీ చేయడానికి ఇష్ట పడే వాడు కాదు. అప్పుడప్పుడు తనకు బంధువులు ఎక్కువయినపుడు, తను మాత్రము ఆ గదిలో పండుకొనే వాడు. ఈ విషయములో రాజీ కి తనకు వాదనలు వచ్చేవి. చివరకు రాజీ పడి పోయే వారు.
          ఒక రోజు రాజీ ఏ బుద్ధి మీదుందో కానీ గోపాలాన్ని నిలేసింది.
ఇన్నాళ్ళూ ధ్యానము, ధ్యానము అంటూ కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు కదా!  ఏమయినా కనిపించినడా?        
  అంటే, కనిపించేదేమిటి?
మరి అలా కూర్చుంటే ఏమి వస్తుంది?
ఆ క్షణము కాస్త ఆనందముగా యుంటుంది.
నాతో వచ్చి, కూర్చోని, టి వి ప్రోగ్రాములు చూడండి.  ఆనందము రాదా ఏమిటి?
అలా కాదే, ధ్యానము చేస్తే మన ఆధ్యాత్మిక స్థితి  పెరుగుతుంది.
మరి, రొజూ సంధ్యా వందనము చేస్తున్నారు కదా!  దాని వలన ఆ స్థితి పెరగదా ఏమిటి?  ఇది కూడా ఎందుకు? గంటల కొద్దీ నిశ్శబ్దముగా అలా కూర్చుంది పొతే, ఇంట్లో ఎవరుండేది కూడా తెలియటము లేదు.
మూడవ కన్ను తెరుచుకుంటుందని, మంచి దర్శనాలు వస్తాయని చెప్పి  మెప్పించే శక్తి తనకు లేదు. అందుకే తను నిశ్శబ్దముగా యుండి పోయినాడు. తనే మళ్ళీ మొదలు పెట్టినది.
మీరు కళ్ళు మూసుకొని ఏమి చూస్తారు?
కళ్ళ ముందు ఏమి కనిపించినా గమనిస్తూ ఉంటాను.
ఇంతకూ ఏమి కనిపిస్తుంది? దాని వలన వచ్చే లాభ మేమిటి?
చీకటి వెలుతురు మధ్య ఏవేవో అర్థము కానివి కనిపిస్తాయి, అయినా వాటినే గమనిస్తూ యుంటాను.
దాని వలన వచ్చే లాభమేమిటి?
బయట ఏమి లభిస్తుందో తెలియక పోయినా, కనిపించిన వాటిని గమనించడమే సాధన.
ఏమో? ఏమి చేస్తునారో, ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఇంతకూ మీకు ఇలా చేయాలని చెప్పిన ప్రబుద్ధుడు ఎవడు?
ఆయనను గూర్చి అలా మాట్లాడ కూడదు.  అయన యొక మహా యోగి.
ఇంతలో పక్కింటావిడ ఎదో అవసరము కొద్దీ వచ్చింది.  రాజీ తో మాట్లాడుతూ,
ఈ రోజు శివాలయములో శివానంద స్వామి ఉపన్యాసముందట. వస్తారా?
వాళ్ళు  ఏమి చెబుతారో, ఏమో, నాకేమి అర్థమవుతున్దండీ?
ఏమో , ఆయన రాజ యోగము గూర్చి మాట్లాడుతాడుట. చాలా విషయాలు చెబుతారుట. చాలా మంది చెప్పినారు. మేము కూడా వెళుతున్నాము. ,  అంటూ వెళ్లి పోయింది.
రాజ యోగమనే మాట  గోపాలాన్ని పట్టేసింది.
రాజీ! నీవు కూడా  రావచ్చు కదే! నాకు వెళ్ళాలని యున్నది.
ఎందుకు? మీ చిన్నపుడెవరో కళ్ళు మూసుకొని కుర్చోమన్నారని, మీరు ఇప్పటి వరకు ఆ పనిని వదలి పెట్ట లేదు. అలా చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పటి వరకు మీ దగ్గిర నుండి జవాబు లేదు. ఇప్పుడిక్కడికి వెళ్లి వచ్చిన తరువాత, మీరా గదిలో, నేనీ గదిలో కళ్ళు మూసుకొని కూర్చుందాము, ఎవరు పిలిచినా పలుకకుండా గడియ వేడుకొని..
ఎందుకలా అనుకుంటావు? నీ ప్రశ్నకు ఈయన నుండి జవాబు వస్తుందేమో? 
ఇంతకూ ఈయన రాజ యోగము గూర్చి చెబుతారో, రాణీ యోగము గూర్చి చెబుతారో? సరే, మీరింతగా అడుగుతున్నారుగా! నేనూ సిద్ధమవుతాను. ఆ పేరుతొ నన్నా మీరొక రోజు మీ ధ్యానము మానేసి, శివాలయానికి వస్తారు కదా! అదే భాగ్యము.
 ------------------------------------------------------------------------------------------------------------------------
          దేవాలయ ప్రాంగణ మంతా క్రిక్కిరిసి యున్నాది. శివానంద స్వామి ఉపన్యాసము మొదలయింది.
  భగవంతుడు సర్వాత్మకుడు, అంటే అందరితో, లేదా అందరిలో ఉండే వాడు ఆయనే.
  సర్వ వ్యాపి, అంతటికి వ్యాపించేది ఆయనే.
సర్వ శక్తిమంతుడు. అందరిలో యుండేది ఆయన శక్తే.
అసలయిన మానవుడిని, అంటే మనలను కొంత సేపు ఆ పేరుతొ పిలువకుండా యాత్రీకుడిగా  భావిద్దాము.
తను ఎక్కడి నుండి వచ్సినాడో, ఏ మూలము నుండి వచ్సినాడో మఱచి పోయినాడు. ఆ మూలమును పట్టుకోవాలని సుదీర్ఘ యాత్ర మొదలు పెట్టినాడు. అందుకే ఈ పాంచ భౌతిక దేహము లోనికి తల్లి దండ్రుల సంకల్పము మరియు యోగము ద్వారా ప్రవేశించినాడు. ఆ విధముగా భౌతిక ప్రపంచానికి కట్టు వడి పోయినాడు.
ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీకు అర్థ రహితాలుగా విచిత్రాలుగా కనిపిస్తాయి. కాస్త ఓపిక తెచ్చుకొని వింటే అన్నీ అర్థమవుతాయి. అంతే కాదు ఇవన్నీ మన ప్రాచీన ఋషుల నిరంతర పరిశీలనలో తేలిన నిజాలు. వీటిని ఋజువు చేయ గలిగిన సాధనాలు ఇప్పుడు ఎన్నో వచ్చినాయి.
ఈ యాత్ర మొదలయింది.
ఒక్క జన్మ కాదు, ఎన్నో జన్మలు.                              
ఒక్క చోటు కాదు, ఎన్నో ప్రాంతాలు.
ఒక్క కష్టము కాదు, ఎన్నో సుదీర్ఘమయిన  క్లిష్ట మయిన అనుభవాలు.
వీటిని ఎదుర్కుంటేనే తను లక్ష్యాన్ని చేరుకుంటాడు.
ఈ విధముగా తను తన తండ్రి అయిన భగవంతుడి లాగా సర్వాత్మకుడు, సర్వ వ్యాపి, సర్వ శక్తిమంతుడు అని తెలుసుకుంటాడు. ఇన్ని అనుభవాల తరువాత తన తండ్రి ఎదిగిన తన బిడ్డను కౌగిలి లోనికి తీసుకుంటాడు. భక్తి మార్గములో దీనినే సారూప్యము, సామీప్యము, సాయుజ్యము అని అంటారు. ఇక్కడ నేను పూర్తి వివరణకు వెళ్ళుట లేదు.
మొదటి జన్మలలో జంతువులను వేటాడి, వాటి మాంసాన్ని ఆహారముగా స్వీకరించినాడు. తరువాత పక్షుల లాంటి వాటిని చూచి, ధాన్యపు గింజలను ఆహారములో కలుపుకున్నాడు.
సుఖాలను అనుభవించుటకు ఏర్పడిన బంధము పిల్లల మీద ప్రేమ గా మారుతుంది.
సమాజము పటిష్థముగా, శాంతివంతముగా ఉండాలంటే కొన్ని లక్షణాలు అందులో వ్యక్తులకు ఉండాలి.
మొదట వచ్చేది ఆశ. అంటే అది తనకు కావాలి. అది తనకు అందక పొతే ఆవేశము. ఎన్నో వైఫల్యాల తరువాత ఎందుకు ఇలా జరుగుతున్నాదని ఆలోచించడము మొదలుపెడతాడు. ఆలోచన మనస్సు యొక్క లక్షణము. అంత వరకు జంతువుల వలె ఆవేశముతో ఎగబడే యాత్రికుడు ఈ విధముగా మనస్సును ఏర్పరచుకొని మానవుడవుతాడు.  మానవుడు కూడా యాత్రికుడే అన్న విషయాన్ని మనము మరచి పోకూడదు.
ఇవన్నీ ఒక్క జన్మలో జరుగవు, కొన్ని జన్మల పర్యంతము జరుగుతుంది.
వెంటనే మరొక ప్రశ్న వస్తుంది. మనిషి చని పోయిన తరువాత అతడి దేహాన్నితగుల బెట్టి వేస్తారు. మళ్ళీ ఆ వ్యక్తీ పుట్టిన తరువాత అన్నీ, మళ్ళీ అనుభవించ వలసిందేనా? ఒక జన్మకు మరొక జన్మకు సంబంధము ఎలా వుంటుంది?
తల్లి దండ్రులు ఇచ్చిన దేహాన్ని స్థూల లేదా పార్థివ దేహమని అంటారు. అంటూ తన దేహాన్ని చూపించినారు. పాదో అస్య విశ్వా భూతాని, త్రిపాద్ అస్య అమృతం దివి అని  పురుష సూక్తము చెపుతుంది. అంటే ఈ విశ్వములోఒక వంతు మాత్రమే మన కంటికి కన బడుతుంది ఉంటారు. మిగిలిన మూడు వంతులు దివిలోయుంటాయి, అంటే కళ్ళకు కనిపించవు. అందుకే నేను కళ్ళతో చూస్తే కానీ నమ్మనన్న వాడు నిజాన్ని ఎప్పుడూ చూడ లేడు.
కనిపించే ఈ వంటికి కనిపించని భాగాలు ఉన్నాయి. ఈ దేహాన్ని విశ్వానికి అనుసంధానము చేస్తూఒక దేహముంటుంది. దీనిని ఎథీరిక్ జంట అని పాశ్చాత్యులంటే సూక్ష్మ దేహమని వేద ఋషులు అన్నారు.
మనకు ఆవేశము కలిగినపుడు, అందుకనుగుణముగా స్పందించేమరొక దేహమున్నది. తీవ్రమయిన కోరికలకు ఆవేశాలకు అది తీవ్రముగా స్పందిస్తుంది.  ఇలాంటి స్పందన యున్నపుడు మనము వివేకాన్ని కోల్పోతాము.  ఈ దేహాన్ని ఆస్త్రల్ దేహమని పాశ్చాత్యులు, కామ దేహమని భారతీయ ఋషులు పిలిచినారు.
ఈ దేహము మనము నిద్ర పొతున్నపుడు  లోకమంతా తిరిగి సమాచారాన్ని సేకరిస్తుంది. దీనినే కామ దేహ గమనము లేదా యాస్త్రల్ ట్రావల్ అని అంటారు.దీనిని నియంత్రించి ఉపయోగించు కో గలిగితే  మనము ప్రపంచములో ఏ ప్రాంతములో ఎప్పుడు ఏమి జరుగుతుందో అతి తక్కువ కాలములో తెలుసుకొని రాగలము.
మనము ప్రశాంతతను తెచ్చుకోగలిగితే , మనలో వివేకము పెరిగే మనస్సు ముందుకు వస్తుంది. ఇది నియంత్రణ లేక పొతే భూతము లాగా మనలను చంపేస్తుంది. నియంత్రణ యుంటే స్వర్గాన్ని భూమికి దింపుతుంది.
          మన ప్రాచీన ఋషులు వీటిని త్రిపురాల నియన్నారు.ఇవి విచ్చల విడిగా యున్నపుడు వాటిని నియంత్రించడానికి మహా దేవుడే దిగి రావలసి వచ్చింది. అదే త్రిపురాసుర సంహారము. ప్రతి జన్మ చివర త్రిపురాసుర సంహారము జరుగుతూనే యుంటుంది.
          అయితే సూక్ష్మ దేహము తన యొక్క సమాచారాన్ని కామ దేహములోను, కామ దేహము తన యొక్క సమాచారాన్ని మనో దేహములోను, దాచి పెడుతాయి. ఈ అనుభవాలు కాస్త పేరుగా గానే వాటిని నిక్షిప్తము చేస్తూ కారణ దేహము లేదా ఆంగ్లములో కాజల్ బాడి ఏర్పడుతుంది. మనో దేహము తన అనుభావాలన్నిటిని కారణ దేహములో దాచి పెడుతుంది. మనిషి చని పోయిన తరువాత నాశనము కానిది కారణ దేహమొక్కటే. ఇదే గత జన్మలోని అనుభవాలను తరువాత జన్మకు చేరుస్తుంది. మనము మాట్లాడే కర్మ అంతా ఈ కారణ దేహము ద్వారానే అందించ బడుతుంది.
          మనిషికి మొదటి దశలో కామ్య సుఖాలు, తిండి, నిద్ర  ఎక్కువగా యుంటాయి. ఇవి మరీ ఎక్కువయితే నైరాశ్యముఏర్పడి ఇంకా ఏమున్నదని అన్వేషణ మొదలు పెడుతాడు. అక్షరాల సంపుటితో మంత్రం ఉచ్చారణ ద్వారా, కఠిన దీక్షల ద్వారా ఊగి పోయే కామ దేహము కొన్ని పనులను చేసి పడుతుంది. ఇక్కడ కొంత మంది మంత్రాలను ఇలా కూడా ఉపయోగిస్తారని చెపుతున్నాను. కాని వాటిని సాత్వికముగా వాడితే అద్భుతము అయిన ప్రయోజనాలు లభిస్తాయి.
          మళ్ళీ అసంతృప్తి కలిగి ఈ స్థితిని కూడా దాట వలె నని అనిపిస్తుంది. బురద నీటిలో ఏదీ కనిపించదు. కదలని స్వచ్చమయిన  నీటిలో అన్నీ కనిపిస్తాయి. అందుకని ఆవేశాన్ని నియంత్రించు కోవాలని అనుకున్నాడు. అప్పుడు మన దృష్టిని స్థిరముగా ఒక చోట యుంచాలి. అది మనతో నిరంతరాయముగా ఉండేదిగా ఉండాలి. అది శ్వాస కావచ్చును. అపుడు ఆవేశము తగ్గుతుంది. మనస్సు ఖాళీగా ఉండుటకు ఇష్ట పడదు. అది కల్లు/సారాయి తాగిన కోతి లాటిది. దానికి పని పెట్టాలి. ఇందు కోసమే విజ్ఞాన భైరవ తంత్ర లో పార్వతీ దేవికి శివ భగవానుడు ఉపదేశించిన మొదటి సాధన  శ్వాస మీద ధ్యాస.
          అప్పుడు మన మనస్సు అనే నీటి కొలనులో బురద క్రిందికి దిగుతుంది.  అడుగున యున్న రహస్యాలు సుస్పష్టముగా కన బడుతాయి.
          ఒక యజమానికి నలుగురు పిల్లలు ఉన్నారనుకుందాము. ప్రక్కింటి స్నేహితుడి కోరిక మీద వారికి సాయము చేయుటకు ఇంట్లో జిలేబి చేసినారు. నాలుగేండ్ల చిన్న కొడుకు బయట ఆటల నుండి పరుగుతో వస్తూ  ఎదురుగా జిలేబి చూచి అమ్మ వద్దని చెప్పే లోపల ఎవరితో చెప్పకుండా ఒకటి నోట్లో వేసుకొని, జిలేబి భలే యుందమ్మా!  అని చెప్పినాడు. ఇక అమ్మకు అవి మనకు కాదు అనే అవకాసము కూడా ఈయ లేదు.
          ఆరేండ్ల మూడవ కొడుకు నాకూ జిలేబి కావాలని గొడవ చేసి, మనకు  కాదంటే ఇల్లంతా పీకి పందిరి వేసే స్థితి లోకి తీసుకు వచ్చి, జిలేబి తీసుకొని తిన్నాడు.
          ఎనిమిదేండ్ల రెండవ కొడుకు అమ్మకు నాన్నకు తిన్నగా కబుర్లు చెప్పినాడు. దృష్టి మాత్రము జిలేబి మీదనే యుంది. అయినా ఆవేశ పడకుండా  ప్రక్కింటి వాళ్ళ కోసము చేసిన జిలేబి మనము తిన గూడదు అని తమ్ముళ్ళకు చెప్పి బుజ్జగించినాడు.. తల్లికి జాలి వేసి వాడికి కూడా ఒక జిలేబి ఇచ్చినది.
          పదేండ్ల మూడవ కొడుకు ఇవంతా తన దైనందిని (డైరి ) లో వ్రాసుకున్నాడు.
 ఇందులో పెద్ద వాడు కారణ శరీరాన్ని, రెండవ వాడు, మనో శరీరాన్ని, మూడవ వాడు కామ శరీరాన్ని, నాల్గవ వాడు భౌతిక శరీరాన్ని సూచిస్తారు. వారి వయస్సులు వారి పరిణామ స్థితిని సూచిస్తాయి.
ఈ సమయములో గుడిలో గంటలు మ్రోగినాయి. నైవేద్యానికి అన్నే సిద్ధమయినాయని ఉపన్యాసాన్ని ఆపి వేసినారు. మరునాడు అదే సమయానికి ఉపన్యాసము కొన సాగుతుందని ప్రకటించినారు

మొదలు





సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకు చే
పారము పొందలేక చెడ బారిన దైన యవస్థ దక్షులె
వ్వార లుపేక్ష చేసిరది వారల చేటగు గాని ధర్మ  వి
స్తారకమయ్యు సత్య శుభ దాయక మయ్యు ప్రశస్తి గాంచెడున్.

          ధర్మము, సత్యము, పాపము చేత అబద్ధము చేత గట్టుకు చేర లేక చెడిన స్థితిలో యున్నప్పుడు సమర్థులయిన వారు దానిని ఉపేక్ష భావముతో చూచినపుడు, అది ఖచ్చితముగా వారికి చెడు గా పరిణమిస్తుంది.
ధర్మము, సత్యము  తిరిగి ప్రతిస్థించ బడుతుంది.
          ఇది యుగ పురుషుడయిన శ్రీ కృష్ణ పరమాత్మ సభా వేదిక మీద ధృత రాష్ట్రునికి ఇచ్చిన సందేశము. మంచి చేయ గలిగి కూడా ఉపేక్ష చేసినపుడు ఫలితము ఎలా ఉంటుందో (ఒక హెచ్చరిక లాగా) సూచించినాడు.
ఇక్కడ మరో విషయము కుడా చెప్పవలసి యుంటుంది. ఒక చిన్న పిల్ల వాడు పరాయి వాళ్ళ తోటలో
తోట కూర దొంగ తనము చేసి, ఇంటికి కూర తెస్తే, వాళ్ళమ్మ “ఎక్కడినుండి తెచ్చినావు ?“ అని కూడా అడగకుండా “ ఈ రోజు కూర ఖర్చు తగ్గినది” ,అని సంతోష పడడమే కాకుండా, మెచ్చుకుంటుంది. అంతే గాక తరువాత వాడు ఎలా తయారవుటాడని ఆలోచించదు. చాలా కాలము తరువాత ఒక పెద్ద  దోపిడీ లో పట్టుబడి కొడుకు వెళ్ళుతుంటే, వాడిని పట్టుకొని ఏడుస్తుంది. అప్పుడు ఆమె కొడుకు “తోట కూర దొంగ తనము నాదే చెప్పి యుంటే నేను ఇలా తయారయే వాడిని కాదు.” అని, తల్లిని చీదరించు కుంటాడు.
          ఈ కథ ఇప్పటి వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుతుంది. మరొక సంఘటన.
          “నీవు అధర్మము చేస్తున్నట్లు నీకు తెలియదా?” అని అడిగితే, “నాకు ధర్మమూ యొక్క స్వరూపము తెలుసు. అధర్మము యొక్క స్వరూపము తెలుసు. నేను చేస్తున్నదీ, తెలుసు. కానీ నా మనస్సు అధర్మము వైపు పోకుండా నియంత్రించు కోలేక పోతున్నాను” అని అంటాడు. ఇదేలాగుందంటే సిగరెట్ త్రాగితే కాన్సర్ వస్తుందని తెలిసి కూడా సిగరెట్ త్రాగుట నియంత్రించు  కోలేని నేటి మానవుడి పరిస్థితిని సూచిస్తుంది. అందుకే ముందు మనస్సునునియంత్రించుకోా వలసిన అవసరము ఏంతో యున్నది.
          ఈ బలహీనతకు చుట్టూ యున్న సామాజిక వాతావరణము కొంత కారణము అయితే మనము ఎన్నుకొన్న మిత్రులు కొంత కారణము అవుతారు. అంటే గాక వ్యక్తీ యొక్క పరిణామ స్థితి కూడా దీనికి బలమిస్తుంది. వ్యక్తీ తప్పు దారిలో వెళ్ళుతున్నప్పుడు అతడికి ఆ విషయము గుర్తు చేయ వలసిన అతడి శ్రేయోభిలాషులకు, బందువులకు యుంటుంది. ఈ భాద్యతను నిర్లక్ష్యము చేస్తే ఎలా యుంటుంది అనేది కూడా పై పద్యము సూచిస్తుంది.
          సహాయము లేక రహదారిలో నిస్సహాయముగా పది యున్న వ్యక్తిని  పట్టించుకోలేని వ్యక్తీ  తన ఇంట్లో తన వాళ్ళకు అదే రకముగా సేవ చేయ వలసిన పరిస్థితులను కల్పించుకుంటాడని మాస్టర్ ఇకె గారు చెబుతారు. ఇదే మనకు ప్రక్రుతి సమాజ భాద్యతను గుర్తు చేసే పధ్ధతి.
                            ---------------------------------------------------
          పినాకినీ నది ఒడ్డున రామ తీర్థము అనే గ్రామము. అందులో  నీలకంథ మహాదేవుడి పేరా శివాలయము.
కొన్ని తరాలుగా దాన్ని కట్టించిన వంశములోని వారే దానిని నిర్వహిస్తున్నారు. ఆ వంశము లోని వారే శివానంద స్వామి. సన్యాసము తీసుకున్న తరువాత దేసమంతటా తిరుగుతూ తన పూర్వీకులు కట్టించిన ఆ గుడిలో సంవత్సరానికి కనీసము ఒక నెల యుంటారు.ఆయన వచ్చినపుడు చుట్టు ప్రక్కల జిజ్ఞాసువులకు ఏంటో ఉత్సాహము కలుగుతుంది. ఆయన కూడా అదే ఉత్సాహముతో వారి సందేహాలను తీరుస్తూ ఉంటారు. ఇది ఆయన తన భాద్యతగా తీసుకున్నారు.