ఈ వ్యాసము ఆవు మీద
వ్రాయాలని అనిపించినది. శ్రీ రామ శర్మ ఆచార్య భారతీయ సంస్కృతికి గంగ, గాయత్రి
మరియు గోవు ప్రధానమయిన అంశాలని ఎన్నో సార్లు చెబుతారు. గంగను పరిశ్రమల వ్యర్థాలతో
మురికి చేస్తున్నాము. గాయత్రి జపమే చేయటము లేదు. ఇక మన చేతులలో గోవు ఎంత దుర్భర
మయిన జీవితాన్ని అనుభవిస్తున్నదో చెప్పనఖ్ఖర లేదు. ఆవులకు సంబంధించిన మూడు
సంఘటనలను వ్రాస్తున్నాను.
మొదటిది ఏప్రిల్
నెల లైఫ్ పాజిటివ్ లో ప్రచురించబడినది. హైదరాబాద్ లో కొండ వీటి న్యూటన్ గారి
ఆధ్వర్యములో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చిన ఒక వ్యక్తికీ చాలా కాలముగా ఆస్తమా
వ్యాధి యున్నది. న్యూటన్ గారు ఆ వ్యక్తిని సమ్మోహన (హిప్నోసిస్) విద్య ద్వారా గత
జన్మ లోనికి తీసుకొని వెళ్ళినారు. ఆయన యొక్క ఆస్తమా వ్యాధికి కారణమును
తెలుసుకొనుటకు ప్రయత్నించినారు.అందులో ఆయన ఒకానొక గత జన్మ సంఘటన బయటకు వచ్చినది. ఆ
జన్మ లో ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఒక ఎద్దు మీద సవారీ చేసే వాడు. ఎద్దు అలసి పోయిన
తరువాత కూడా దానిని లాఠీ తో కొట్టి సవారీ చేసే వాడు. అది పడిన రొప్పు ఈయనకు ఈ
జన్మలో ఆయాసము గా వచ్చినది అని తేలినది. మరి దీనికి విరుగుడు ఎలా? ఆ వ్యక్తీ మూడు
నెలలు రోజూ క్రమము తప్పకుండా ఎదో ఒక ఆవు కళ్ళ లోకి చూస్తూ దానికి క్షమాపణ
చెప్పుకోవాలని సూచనా వచ్చినది. మూడు నెలలు చేసిన తరువాత అతడికి ఆ వ్యాధి తగ్గి
పోయినదట. ఇక మీ ఇష్టం, నమ్మండీ నమ్మక పొండి.
ఇక రెండవది. భారత
దేశములో మొట్ట మొదటి సారి అత్యధికముగా హోమియోపతి పుస్తకాలను ప్రచురించేది జైన్
పబ్లిషర్స్ అని అందరికి తెలుసు. ఇందులో కూడా ఒక ఆవు పాత్ర యున్నది. ప్రచురణ కర్త
కొన్ని హోమియో పుస్తకాలకు హక్కు సంపాదించుకొని ముందే ధిల్లీ దగ్గిర ఒక హోమియోపతి
కాలేజ్ లో అమ్ముకొనుటకు ఆర్డర్ తెచ్చుకొన్నాడు. చాలా కష్ట పడి తక్కువ ప్రతులు
తయారు చేసినాడు. ఏవో కారణాలు చెప్పి వాళ్ళు ఆ పుస్తకాలు తీసుకొనుటకు
నిరాకరించినారు. ఎట్లో ఒప్పించి వాళ్ళకు ఆ పుస్తకాలను అమ్ముటకై ఆ కాలేజికి వెళ్లి
కొడుకును బయట పుస్తకాల పార్సల్ కు కాపలా
ఉంచి లోపలకు వెళ్ళినాడు. ఈ లోపల ఒక ఆవు పరుగు తీస్తూ వచ్చి ఆ పార్సల్ ను కొమ్ములతో
ఎత్తి పుస్తకాలను చెల్లా చెదురు చేసింది. ఆ దారిన పోతున్న హోమియోపతి విద్యార్థులు
ఆ కుర్రాడికి సాయము చేయుటకు అక్కడికి ఆ పుస్తకాలను చూచి “ఇవి మాకు అమ్ముతావా?” అని
అడిగినారు. పరిస్థితి తెలిసిన ఆ కుర్రాడు అందుకు సిద్ధ పడినాడు. వాళ్ల నాన్న అంగీకారము
కుదరక నైరాశ్యముతో బయటకు వచ్చేటప్పటికి కొడుకు మొత్తము పుస్తకాలను అమ్మి వేసినాడు.
ఈ విధముగా వాళ్లకు ఒక ఆవు మొదటి ప్రచురణ అమ్ముడవుటకై సహకరించినది.
ఇక మూడవ సంఘటన.
నేను మా బంధువులని ఇద్దరినీ విజయవాడ బస్సు ఎక్కించాలని మా వీధిచివరలో నిలబడి
యున్నాను. అక్కడ ఒక పుచ్చ కాయల కొట్టు ఒకటి యున్నది. పుచ్చ కాయల లోని మెత్తటి
భాగాన్ని తిని మిగిలినది కింద పది వేస్తె ఒక ఆవు దూడ క్రింద వాటిని ఏరుకొని
తింటున్నది. నా సరదా కోసము పది రూపాయలకు ముక్కలు కొని ఆ దూడ కు అందించినాను. అది
వాటి గబా గబా తిని వేసి చాలా వేగముగా ఏటో వెళ్లి పోయినది నేను తిరిగి ఎదురు
వైపున్న బస్ స్టాప్ కు చేరినాను. అయిదు నిముషాల తరువాత ఆ దూడ మరో మూడు దూడలను వెంట
తీసుకొని నా దగ్గిరకు వచ్చినది. అవి ఎంత చెప్పినా వెనక్కు వెళ్ళవు నా చుట్టూ
ప్రదక్షిణాలు చేస్తున్నాయి. అప్పుడు నాకు అర్థమయింది, వెళ్ళిన ఆవు దూడ నేను పుచ్చ
కాయల ముక్కలను ఇస్తానని తన మరో మూడు సహచరులను పిల్చుకొని వచ్చినది. దానికి నా
మనస్సులో ఇంకా లేవమ్మా అని అన్న ప్రతి సారీ దానికి అర్థమైనట్లు, అదేమీ కుదరదు మాకు
కావలసినదే అన్నట్లు తల అడ్డముగా ఊపినది. అది ఆ ఒక దూడ మాత్రమె.ఇక నన్ను ఇవి వదలి
పెట్టవని తెలుసుకొని అదే కొట్టు లోకి వెళ్లి మరో పది రూపాయలకు ముక్కలు తెచ్చి
వాటికిచ్సిన తరువాత అవి నన్ను వదిలి పెట్టినవి.
ఇందులో నాకు కొన్ని
విషయాలు తెలిసినవి. నేను మనసులో అనుకున్న మాట ఆ
దూడకు తెలుస్తున్నది. అంతే కాక అది తన స్నేహితులను తనతో బాటు తినాలని
పిల్చుకొని వచ్చినది. ఇప్పటి మనుషులకిన్తటి ఇంగితమున్నదంటారా?
No comments:
Post a Comment