Friday, February 3, 2017

ఆర్యులు ఎక్కడినుండి వచ్చినారు?

                                                    
.


“వారాశించే దానిని  గూర్చి కలలు కంటారు. ఆ కలలే నిజమని నమ్ముతారు” అంటారు చిల్లింగ్ వర్త్. .”భారతీయులలో మానసిక విభజనను కోరిన వారు ఆర్య ద్రావిడ సిద్ధాంతమును ప్రతిపాదించినారు.  వారి ప్రతిపాదన  ప్రకారము ఈ దేశములో మొదట  తురీయులన బడే వారు ఉండే వారు. వారిని కొండల పైకి అడవుల లోనికి తరిమి వేసి, ద్రావిడులు  తమ కొత్త సంస్కృతిని ఏర్పరిచినారు. ఆర్యులు పశ్చిమ సరి హద్దుల నుండి వచ్చి, ద్రవిడుల నగరాలను ధ్వంసము చేసి, వారిని దక్షిణ దేశానికి తరిమి వేసినారు. ఈ విధముగా ఉత్తర భారతాన ఉన్న వారు ఆర్యులు, దక్షణాన ఉన్న వారు ద్రవిడులు మరియు కొండలలో కోనల్లో ఉన్న వారు తురీయులు. సుమారు క్రీ శ ౧౭౦౦ లో బాతిలోమ్ హసీ మేల్ బర్గ్ ఈ వాదనకు మూల పురుషుడు. ౧౮౨౪ లో  కాల్డ్వెల్ ఈ వాదనను సమర్థించినాడు. రెవరెండ్ పోప్ హ్యుజన్ హుల్స్ జ్యూవన్  బార్కీ , ఫాదర్  హెన్రీ మున్నగు వారు దీనిని ప్రచారము లోనికి తెచ్చినారు. సుమారుగా ౭౦౦ సంవత్సరాలు ముస్లిం పాలకులు సాధించ  లేని భారతీయ విభజనను బ్రిటిష్ వారు ౨౦౦ సంవత్సరాలలో  కొంత వరకు సాధించ గలిగినారు.
అస్సాం(అహోం)  లోని వారు పొట్టిగా ఉంటారు. పంజాబ్ వారు ఆజాను బాహులు.  కాశ్మీరము  వారు తెల్లగా అందముగా ఉంటారు. భూమధ్య రేఖకు దగ్గిరగా ఉన్న వారు  నల్లగా ఉంటారు. ఇన్ని రకాల ప్రజల సమాహారమే భారత దేశము. ఈ అందరికీ శ్రీ రామ చంద్రుడు మర్యాదా పురుషోత్తముడే, శ్రీ కృష్ణుడు మహాయోగి మాత్రమె గాక భక్త జన హృదయుడు.  మహాదేవుడు అందరికీ ఆరాధ్యనీయుడు. అందరూ అష్టాదశ పురాణాలనే చదువుతారు, ఆ పుణ్య క్షేత్రాలనే దర్శిస్తారు, ఆ నదుల లోనే స్నానము చేస్తారు. ఒక మాట చెప్పాలంటే నదుల స్నాన ఘట్టాలు, పుణ్య క్షేత్రాలు  అందరూ కలిసే కూడలి ప్రదేశాలు అయినాయి. రూపు రేఖలే మనుషుల ఔన్నత్యాని నిర్ణయిస్తాయన్న  వెఱ్ఱి భ్రమకు ఆర్య ద్రావిడ విభజన మరింత బలాన్ని చేకూర్చింది. సాధన లోనికి తీసుకొని రాలేని  శాస్త్రీయ  పరిజ్ఞానము ఎటువంటి వెఱ్ఱి తలలనైనా వేయించ గలదు. అన్నిటికీ ఫలితమొక్కటే. జాతీయ భావము స్థానములో బావ దాస్యము వేళ్ళూని నిలిచింది.
ఆర్యులు అందగాళ్ళు ఆజాను బాహులు, తెల్లగా ఉంటారు. ద్రవిడులు నల్లగాఉన్తారు, పొట్టిగా ఉంటారేమో? మరి ఆర్యులు/ద్రవిడులు ఆరాధించే రామ/కృష్ణుల యొక్క రంగేమిటి?తెలుపేనా? ద్రావిడ నాయకుడుగా పేర్కొన బడ్డ రావణుడు  ఎవరికీ పుట్టినాడు. ఆయన ఆరాధ్య దైవమెవరు? భాగవత పురాణములో చెప్ప బడి దక్షిణ భారత దేశాన్ని పాలించిన ద్రావిడుడు అను పేరు గల రాజు ఏ పరంపరనుండి వచ్చినాడు?
వాల్మికి రామాయణములో సీతా మాత శ్రీ రాముడిని ఆర్య పుత్రా! అని ఎన్నో సార్లు పిలిచినట్లు ఉంటుంది. మర్యాద పూర్వకముగా పిలుచుటకు ఉపయోగపడే ఆర్య శబ్దము జాతి పేరుగా మారినది. మరొక రాజు యొక్క పరిపాలనా క్షేత్రము ఆ ప్రాంత ప్రజల జాతి పేరుగా మారినది. మరి ప్రముఖ ద్రావిడ భాషగా చెప్ప బడుతున్న తమిళమునకు  వ్యాకరణ కర్త అయిన అగస్త్య ఋషి వర్యుడు  ద్రవిడుడా? వైదిక పరంపరలో కనిపించడా?
దేహమును మనస్సు  వేర్వేరుగా భావించిన పాశ్చాత్య  శాస్త్రజ్ఞుల లో కొందరు  మనస్సులో కలిగే తీవ్ర వికల్పములే భౌతికముగా  కాన్సర్ వ్యాధికి కారణమవుతుందని  గుర్తించినారు.  అటువంటి వారిలో కొందరు మానసిక సామీప్యత కంటే రూపు రేఖలే జాతిని  నిర్దేశిస్తాయని తెలుపుతూ  జాతి భేదమనే మరో కాన్సర్ ను ప్రవేశ పెట్టినారు. మనుషులను, మనుషుల బృందాలను విశిష్ట లక్షణాల ఆధారముగా కలుపుకుంటూ పోయే వారు దేవతలు, విడ గొడుతూ పోయే వారు రాక్షసులు.
హరప్పా మేహన్  జోడారో త్రవ్వకాలలో ఒక చోట  ౨౬ మానవ ఆస్థి పంజరాలు కనిపించినాయిట. అందులో ఒకడు మెట్లనుంది దిగుతూ, మరొకరు పైకెక్కుతూ మరనిన్చునట్లు నిర్ధారించుకొన్నారు. ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడి యున్న మానవ కంకాళాలను చూచి, అనాగారికులయిన ఆర్యులు నాగరికులకు చెందినా హరప్పా , మేహెన్ జోదారో  నగరాలను ధ్వంసము చేసినారని  వీలర్, ఫిగేట్ లు నిర్ణయానికి వచ్చేసినారు. ఈ నగరాలు శంబరులవని, వీటిని ఆర్యులు నాశనము చేసినారని ఫిగేట్ చెప్పినాడు. కానీ శంబరులు పర్వత వాసులని ఋగ్వేదం చెబుతుంది. ఈ విషయము ఫిగేట్ గుర్తించ లేదేమో?
నదులు కాల గమనములో వరదలు వచ్చుట పరివాహ మార్గమును మార్చుకొనుట అందరికి తెలిసిన విషయమే. ఈ నగరాలు సింధూ నదికి తీవ్రమయిన వరదలు వచ్చినపుడు  నాశనము చేయ బడి యుండ వచ్చునన్న విషయము వారికి తెలియదా? కానీ వారి లక్ష్యము వేరే కదా.
   ఇటీవల అరేబియా సముద్రములో సాధించగా దొరికిన ద్వారక నగరమునకు సంబంధించిన  రాతి చెక్కడాలకు హరప్పా, మేహన్ జోదారో, లోతల్  లో దొరికిన చెక్కడాలకు పోలికలు కన్పించినవి. అవి ఒకే నాగరికతకు సంబంధించినవన్న భావనను కల్గించినవి. ఆ సిద్ధాంతమును విశ్వసించే వారిలో ఏ విధమైన మార్పు వచ్చినట్లు కనిపించదు.
ఇంకా ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చిన వారయితే అక్కడ ఆ పరంపర చిహ్నాలేవీ లేవేమి? ఎవరికైనా వారు తమ వెంట నిలుపుకున్న వారసత్వము వారిదే అవుతుంది. వారు అది ఎప్పుడో ఎవరి దగ్గిరనుండో సంపాదించారన్న సిద్ధాంతానికి విలువ లేదు. వేదాలలో సరస్వతి, సింధూ నదుల ప్రస్తావన తప్ప మధ్య ప్రాంతములో ఏ ప్రదేశము యొక్క ప్రస్తావన లేదన్న విషయాన్ని గుర్తించాలి.
ఆర్యుల ప్రధాన భాష సంస్కృతము. సంస్కృతమే గాక ప్రాకృత భాషలు కూడా వాడుకలో ఉన్నట్లు రామాయణము చదివిన వారికి తెలుస్తుంది. ప్రపంచములో ప్రధాన యూరప్ ఖండ భాషలన్నిటికి మాతృకలుగా చెప్ప బడుతున్న గ్రీకు, లాటిన్ భాష పదాలతో సంస్కృతముకు ఉన్న నిర్దుష్టమయిన  సంబంధమును చూచి విదేశీ భాష కోవిదులు నివ్వెర  పోయినారు. తర తరాలుగా మార్పు చెందని సంస్కృత వ్యాకరణము వారిని ఆశ్చర్య పరచినది. అయినా భారత దేశము నిలుపుకున్న సంస్కృతమును యూరోపియన్ భాషల మాతృకగా అంగీకరించ లేక  సంస్కృత భాషకు యూరోపియన్ భాషలకు ఒకే మాతృక ఉన్నాడని ప్రతిపాదించినారు. ఈ విధముగా ఒకే బృందము  మధ్య ఆసియా నుండి  బయలు దేరి వేర్వేరు శాఖలుగా చీలి అందులో ఒక శాఖ భారత దేశమునకు వచ్చినదని ప్రతిపాదించినారు. అయినా అందులో ఏకాభిప్రాయము లేదన్న విషయాన్ని క్రింది వ్యాఖ్యలు సూచిస్తాయి.
“ఎక్కడయితే సంస్కృతము, జెండ్ (పార్సీ) భాషలు మాట్లాడుతారో అక్కడే ఆర్యుల జన్మ స్థానముంది. లేదా ఉండ వచ్చును”అన్నారు హౌఫర్
“జెండ్, గ్రీక్, లాటిన్, గోతిక్ భాషలన్నియు వేర్వేరు కాలములలో సంస్కృతమునుండి జన్మించి ఉంటాయి” అన్నారు కర్జన్.
“మనము ఒప్పుకున్నా , ఒప్పుకొనక పోయినా , అతి ప్రాచీన భాషగా సంస్కృతమును చూడ వలసి యున్నది.” అన్నారు బీం అనబడు చరిత్ర కారుడు.
“యూరప్ లోని అనేక జాతుల మూలమునకు తిరుగు లేని ఋజువు సంస్కృతమే అవుతుంది” అన్నారు లూయీస్ జకోలియాట్.



.

3 comments:

  1. మొత్తాని చివరలో నీ భాష భజనతో నీవెవరో తెలియజెప్పుకున్నావ్.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ఈ చెత్త వాక్యంలోని భాషాద్వేషంతో నీవెవరో తెలియజెప్పుకున్నావ్.

      Delete